తెలుగు న్యూస్  /  Business  /  5 Fundamentally Strong Stocks Hit 52-week Highs. More Gains Ahead?

5 stocks which hit 52-week highs: 52 వీక్ హై లో ఈ స్టాక్స్. ఇప్పటికీ మించిపోలేదు

HT Telugu Desk HT Telugu

22 November 2022, 18:19 IST

  • ఫండమెంటల్స్ బలంగా ఉన్న ఈ ఐదు స్టాక్స్ తాజాగా 52 వారాల గరిష్టాన్ని అందుకున్నాయి. ఇప్పటికీ మించిపోలేదని, ఇప్పుడు కూడా వీటిని కొనుగోలు చేయడం లాభదాయకమేనని నిపుణుల మాట.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Q2 ఫలితాల సీజన్ లో ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ హవా నడుస్తోంది. అలాగే, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ అప్పుడప్పుడు చిన్నచిన్న ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ను ఇస్తాయి. అలా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండి, తాజాగా 52 వారాల హై కి చేరిన ఈ ఐదు స్టాక్స్ పై ఓ కన్నేయండి..

1) గాడ్ ఫ్రే ఫిలిప్స్(Godfrey Philips)

ఇది ప్రాథమికంగా సిగరెట్లను తయారు చేసే సంస్థ. సిగరెట్ల మాస్ ప్రొడక్షన్ కు ఇది ఫేమస్. 1844లో లండన్ లో ఈ సంస్థను ప్రారంభించారు. ఈ నవంబర్ 18న ఈ స్టాక్ 52 వారాల అత్యున్నత ధర రూ. 1913 కు చేరుకుంది. గత సంవత్సరం కాలంలో ఈ షేరు విలువ 65% పెరిగింది. ఈ సంవత్సరం Q2లో ఈ సంస్థ రూ. 1,234.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరం Q2 కన్నా ఇది 53% అధికం. అలాగే, ఈ Q2లో సంస్థ 178.2 కోట్ల లాభాలను ఆర్జించింది. కరోనా ప్రభావం తగ్గడం, సిగరెట్ల స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మొదలైనవి సంస్థ అమ్మకాలకు అనుకూలంగా మారాయి.

2) ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (Exide Industries)

ప్రధానంగా బ్యాటరీలు, వాటి అనుబంధ వస్తువుల తయారీలో ఉన్న ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. Exide Industries భారత్ లో మార్కెట్ లీడర్. ఆటోమొబైల్, ఇండస్ట్రియల్, సబ్మెరైన్ సహా స్టోరేజ్ బ్యాటరీ కేటగిరీల్లో ఇదే మార్కెట్ లీడర్. ఈ సంస్థ నవంబర్ 18న 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఆ రోజు Exide Industries షేరు వాల్యూ రూ. 188కి చేరింది. అయితే, లిథియం ఇయాన్ బ్యటరీలపై భారీ దిగుమతి సుంకం, టెక్నికల్ ఎక్సపర్టైజ్ లేకపోవడం మొదలైనవి సంస్థ ఆదాయాన్ని దెబ్బతీస్తున్న అంశాల్లో ప్రధానమైనవి. అంతేకాకుండా, ఎక్సైడ్ కు ఇన్నాళ్లు కస్లమర్లుగా ఉన్న మహింద్ర అండ్ మహింద్ర, హ్యుండై, ఓలా ఎలక్ట్రిక్ సంస్థలు సొంతంగా బ్యాటరీ తయారీని ప్రారంభిస్తున్నాయి. ఇది కూడా ఎక్సైడ్ కు ప్రతికూలమే. Q2లోలో మంచి ఫలితాలు రావడంతో గత నెలలో షేరు విలువ 21% పెరిగింది.

ఇంజినీర్స్ ఇండియా ( Engineers India)

ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ ఆధీనంలో ఉంటుంది. 1965లో దీన్ని ప్రారంభించారు. హైడ్రో కార్బన్ ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందించడానికి దీన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఇది నాన్ ఫెర్రస్ మెటలర్జీ, ఇన్ఫ్రా స్ట్రక్చర్, వాటర్ వేస్ మేనేజ్ మెంట్, ఎరువుల రంగాల్లోకి వెళ్లింది. నవంబర్ 18న ఈ సంస్థ షేరు విలువ రూ. 82 రూపాయలకు చేరుకుని 52 వారాల గరిష్టానికి చేరింది. గత సంవత్సరం కాలంలో ఈ షేరు విలువ 12% పెరిగింది. ఈ Q2లో Engineers India రూ. 858.2 కోట్ల టర్నోవర్ ను సాధించింది. నికర లాభాలు గత Q2తో పోలిస్తే 65% పెరగడం గమనార్హం.

4) టీపీసీఎస్ (TCPL)

టీపీసీఎస్ (TCPL) మొదట ట్వంటీ ఫస్ట్ సెంచరీ ప్రింటర్స్ గా 1987లో ప్రారంభమైంది. ఫోల్డింగ్ కార్టన్స్ తయారీలో ఈ సంస్థ మార్కెట్ లీడర్. ఫ్లెక్సిబుల్, ఫోల్డింగ్ కార్టన్లకు డాబర్, మారికో, పతంజలి, యూనీ లీవర్ సంస్థలు టీపీసీఎల్ కస్టమర్లే. ఈ సంస్థ కూడా నవంబర్ 18న 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఆ రోజు సంస్థ షేరు ధర రూ. 1710కి చేరింది. సంవత్సర కాలంలో ఈ సంస్థ షేర్ హోల్డర్లకు మల్టీ బ్యాగర్ గా మారింది. వారికి 233% రిటర్న్ అందించింది. Q2లో సంస్థ టర్నోవర్ రూ. 364.1 కోట్లుగా ఉంది.

5) అతుల్ ఆటో (Atul Auto)

త్రి చక్ర వాహనాల తయారీలో లీడర్ గా ఉన్న సంస్థ అతుల్ ఆటో. 1970లో ఇది గుజరాత్ లో ప్రారంభమైంది. అతుల్ ఆటో షేరు కూడా నవంబర్ 18న రూ. 322 కి చేరి, 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. మంగళవారం ఈ షేరు ధర రూ. 331గా ఉంది. త్వరలో ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి వెళ్లనున్నట్లు సంస్థ ఇటీవల ప్రకటించింది.

బుల్లిష్ ట్రెండ్(bullish trend)

సాధారణంగా 52 వారాల గరిష్టానికి చేరిన స్టాక్స్ ను bullish trendలో ఉన్నవాటిగా భావిస్తారు. కొందరు మూమెంటమ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటెజీని ఫాలో అవుతూ, ఇలా ఆల్ టైమ్ హైకి వెళ్లిన షేర్లను కొనుగోలు చేస్తుంటారు. షేరు ధర మరింత పెరుగుతుందన్న ఆలోచనతో వారు ఈ స్ట్రాటెజీని ఎన్నుకుంటారు.

(ఇక్కడ అందించిన సమాచారం నిపుణుల విశ్లేషణ మాత్రమే. మదుపర్లు సొంత అనాలిసిస్ తో షేర్లు కొనుగోలు చేయడం శ్రేయస్కరం)