తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon: ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించే ట్రిక్స్ ఇవేనట..

Amazon: ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించే ట్రిక్స్ ఇవేనట..

Sudarshan V HT Telugu

28 September 2024, 15:30 IST

google News
  • Amazon staff tricks: కోవిడ్ 19 సమయంలో పాపులర్ అయిన ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని క్రమంగా తొలగించే దిశగా పలు కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు, ఉద్యోగులు ఆఫీస్ లకు వెళ్లి వర్క్ చేయడంపై ఆసక్తి చూపడం లేదు. దాంతో, ‘వర్క్  ఫ్రం హోం’ ను కంటిన్యూ చేయడానికి వింత వింత టెక్నిక్స్ వాడుతున్నారు.

ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించే ట్రిక్స్ ఇవేనట..
ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించే ట్రిక్స్ ఇవేనట.. (REUTERS)

ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించే ట్రిక్స్ ఇవేనట..

Amazon staff tricks: అమెజాన్ ఇటీవల తన హైబ్రిడ్ వర్క్ పాలసీని రద్దు చేసింది. జనవరి 2025 నుండి వారానికి ఐదు రోజులు ఉద్యోగులందరూ కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ఆదేశించింది. అందరూ కలిసి ఒకే చోట ఉన్నప్పుడు సహకారం, మేధోమథనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో పేర్కొన్నారు.

వర్క్ ఫ్రం ఆఫీస్ పై వ్యతిరేకత

కార్యాలయానికి తిరిగి రావడం వేలాది మంది సిబ్బందిని నిరాశపరిచింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు అమెజాన్ యాజమాన్యాన్ని అభ్యర్థిస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కార్యాలయానికి తిరిగి రావడాన్ని దాటవేయడానికి అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించే మూడు సాధారణ ట్రిక్స్ ను ఉపయోగిస్తారని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మాజీ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు.

మూడు ట్రిక్స్

ఆఫీసుకు తిరిగి రాకుండా, వర్క్ ఫ్రం హోం చేసేందుకు అమెజాన్ ఉద్యోగులు ఉపయోగించిన మూడు తెలివైన హ్యాక్ లను జాన్ మెక్ బ్రైడ్ తన పోస్ట్ లో వెల్లడించాడు. మెక్ బ్రైడ్ 2023లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు రాజీనామా చేసి వేరే కంపెనీలో చేరారు.

కాఫీ బ్యాడ్జింగ్

మెక్ బ్రైడ్ మొదట అమెజాన్ (amazon) ఉద్యోగులే కాకుండా చాలా ఇతర కంపెనీల్లో పని చేసే హైబ్రిడ్ ఉద్యోగులు ఉపయోగించిన టెక్నిక్ ను వెల్లడించారు అదే కాఫీ బ్యాడ్జింగ్. ఈ టెక్నిక్ ద్వారా చాలా తక్కువ సమయం ఆఫీసులో కనిపిస్తారు. వీరు ఆఫీస్ కు వచ్చి లాగిన్ వంటి రెగ్యులర్ యాక్టివిటీస్ పూర్తి చేసి, కాఫీ తాగేసి ఇంటికి వెళ్లిపోతారు. అనంతరం, వర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేస్తారు. అయితే, ఈ ట్రిక్ ఎక్కువ రోజులు పని చేయలేదట. కంపెనీ ఉద్యోగుల వర్కింగ్ ప్లేస్, వర్కింగ్ టైమ్ లను ట్రాక్ చేయడం ప్రారంభించడంతో ఈ కాఫీ బ్యాడ్జింగ్ (Coffee badging) టెక్నిక్ ను ఇప్పుడు ఉపయోగించడం లేదు.

ఇంటి వై-ఫై పేరును మార్చడం

అమెజాన్ ఉద్యోగులు కార్యాలయ నిబంధనలను మోసం చేయడానికి ఉపయోగించే మరొక ట్రిక్.. వారి ఇంటి వై-ఫై కనెక్షన్ పేరును మార్చడం. ఆఫీసులోని వైఫై నెట్ వర్క్ ఏ పేరుతో ఉందో అదే పేరును హోమ్ వైఫై నెట్ వర్క్ కు ఉపయోగించడం ఈ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల ఉద్యోగులు లాగిన్ అయినప్పుడు, వారి వైఫై (wifi) నెట్ వర్క్ పేరు ఆధారంగా రిపోర్టింగ్ సాఫ్ట్ వేర్ వారు ఆఫీసు నుంచే వర్క్ చేస్తున్నట్లు మార్క్ చేస్తుంది. ఈ టెక్నిక్ కూడా చాలా రోజులు పని చేయలేదు. కంపెనీ ఐటీ రిపోర్టింగ్ సాఫ్ట్ వేర్ ను మార్చేసింది.

ఆఫీసులో బ్యాడ్జిని విడిచిపెట్టి వెళ్లడం..

చివరగా, కొంతమంది ఉద్యోగులు తమ ఐడీ బ్యాడ్జిని ఆఫీస్ లోని సహోద్యోగికి ఇచ్చి వెళ్తారు. ఆ సహోద్యోగి ఇతడి బ్యాడ్జితో చెక్ ఇన్, చెక్ అవుట్ అవుతాడు. దాంతో, అతడు ఆఫీస్ నుంచే వర్క్ చేస్తున్నట్లు కంపెనీ భావిస్తుంది. ఇలా నెలల తరబడి చేసిన వ్యక్తి తనకు తెలుసు అని మెక్ బ్రైడ్ తెలిపాడు.

తదుపరి వ్యాసం