Ambani's wedding: అంబానీస్ వెడ్డింగ్ ఎఫెక్ట్.. జూలై 15 వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయమంటున్న ముంబై కంపెనీలు-mumbai gets wfh till july 15 as anant ambani radhika prep for wedding ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ambani's Wedding: అంబానీస్ వెడ్డింగ్ ఎఫెక్ట్.. జూలై 15 వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయమంటున్న ముంబై కంపెనీలు

Ambani's wedding: అంబానీస్ వెడ్డింగ్ ఎఫెక్ట్.. జూలై 15 వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయమంటున్న ముంబై కంపెనీలు

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 10:36 PM IST

Ambani's wedding: జూలై 12న ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్ తో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వివాహానికి ప్రపంచం నలు మూలల నుంచి అతిరథ మహారథులు హాజరువుతున్నారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ (ANI )

Ambani's wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం నేపథ్యంలో.. ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాణిజ్య కేంద్రం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని పలు కార్యాలయాలు జూలై 15 వరకు రిమోట్ గా పనిచేయాలని ఉద్యోగులకు సూచించాయి.

వర్క్ ఫ్రం హోం చేయండి..

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, సెక్యూరిటీ ఆంక్షలు ఉంటాయని, అందువల్ల వర్క్ ఫ్రం హోం చేయాలని ఉద్యోగులకు సూచించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ (mukesh ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జూలై 12 న బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ముంబైలోని రద్దీగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న వివాహ వేదిక చుట్టూ జూలై 12 నుంచి 15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), సెబీ, అనేక అంతర్జాతీయ బ్యాంకులు ఉన్నాయి. అంబానీల ఇంట్లో జరిగే ఈ విలాసవంతమైన వేడుకల కోసం విధిస్తున్న ఈ ఆంక్షలు ముంబైలోని స్థానికులకు, ఉద్యోగులకు ఉద్యోగులలో అసౌకర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించే అవకాశం ఉంది.

చుక్కలనంటిన హోటల్ రూమ్స్ ధరలు

అంబానీ-మర్చంట్ వివాహం కారణంగా ముంబై అంతటా హోటల్ బుకింగ్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాంతో, పలు లగ్జరీ హోటళ్లు ఒక్కో రాత్రికి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ వంటి వేదికలు జూలై 10 నుంచి 14 వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ వివాహానికి బాలీవుడ్, హాలీవుడ్, వ్యాపార, క్రీడా వర్గాల నుంచి అతిథులు హాజరవుతున్నారు.

ప్రి వెడ్డింగ్ వేడుకలు

అంబానీ కుటుంబం నిర్వహించే సంప్రదాయ గుజరాతీ ప్రీ వెడ్డింగ్ ఆచారమైన 'మామేరు' వేడుకను జూలై 3న నిర్వహించారు. 'బేబీ', 'పీచెస్', 'లవ్ యువర్సెల్ఫ్' వంటి హిట్ చిత్రాలతో అతిథులను అలరించిన అంతర్జాతీయ పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ ప్రదర్శనతో జూలై 7న అద్భుతమైన సంగీత్ వేడుకతో వేడుకలు ముగిశాయి. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు కిమ్, క్లోయి కర్దాషియాన్, బాక్సర్ మైక్ టైసన్ వంటి ప్రముఖులు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు హాజరు కానున్నారు.

ప్రముఖుల హాజరు

హెచ్ ఎస్ బీ సీ హోల్డింగ్స్ చైర్మన్ మార్క్ టక్కర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జే లీ, యూకే మాజీ నేతలు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని బ్లూమ్ బర్గ్ తెలిపింది. అతిథుల జాబితాలో సౌదీ ఆరామ్కోకు చెందిన అమీన్ నాసర్, బీపీ పీఎల్సీకి చెందిన ముర్రే ఆచింక్లోస్, జీఎస్కే పీఎల్సీకి చెందిన ఎమ్మా వాల్మ్స్లీ, లాక్హీడ్ మార్టిన్కు చెందిన జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ఉన్నారు.

Whats_app_banner