Work Pressure : వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య!-chennai software employee dies by suicide was in depression over work pressure ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Work Pressure : వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య!

Work Pressure : వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య!

Sharath Chitturi HT Telugu
Sep 22, 2024 12:10 PM IST

Software employee suicide : వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పని ఒత్తిడి, ఉద్యోగంలో అసంతృప్తితో వచ్చిన డిప్రెషన్​కి గత రెండు నెలలుగా అతను చికిత్స తీసుకుంటున్నాడు.

వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య!
వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య!

చెన్నైకి చెందిన ఓ 38ఏళ్ల సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మరణ వార్త ఇప్పుడు హెడ్​లైన్స్​లో నిలిచింది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పూణె ఉద్యోగి ఆనా సెబాస్టియన్​ హఠాణ్మరణంతో ఇండియాలో వర్క్​ కల్చర్​పై విపరీతంగా చర్చలు జరుగుతున్న సమయంలో అలాంటి ఘటనే ఇంకొకటి వెలుగులోకి రావడంతో ‘వర్క్​ కల్చర్​’ అంశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ జరిగింది..

తమిళనాడు థెని జిల్లాకు చెందిన కార్తికేయన్​కి సాఫ్ట్​వేర్​ రంగంలో 15ఏళ్ల ఎక్స్​పీరియెన్స్​ ఉంది. అతనికి పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు 10ఏళ్లు, 8ఏళ్లు.

కాగా గత కొంతకాలంగా కార్తికేయన్​కి పని ఒత్తిడి పెరిగినట్టు, ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై అతను డిప్రెషన్​కి గురైనట్టు సమాచారం. గత రెండు నెలలుగా అతను డిప్రెషన్​కి ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:- Bengaluru horror: బెంగళూరులో దారుణం; మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కి..

కాగా గురువారం కార్తికేయన్​ ఒక్కడే.. చెన్నైలోని తన ఇంట్లో ఉన్నాడు. పిలల్ని తల్లి దగ్గర వదిలి, కార్తికేయన్​ భార్య జయరాణి.. చెన్నై నుంచి 300కి.మీల దూరంలో ఉన్న తిరునల్లూర్​ ఆలయానికి వెళ్లింది. రాత్రి వచ్చి తలుపు కొట్టగా కార్తికేయన్​ డోర్​ తెరవలేదు. తన దగ్గర ఉన్న కీతో డోర్​ తెరిచి లోపలికి వెళ్లింది. విఘతజీవిగా పడి ఉన్న కార్తికేయన్​ని చూసి ఆమె షాక్​కు గురైంది.

కార్తికేయన్​ శరీరం చుట్టూ విద్యుత్​ వైర్లు ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైవ్​ విద్యుత్​ వైర్లతో విద్యుదాఘాతానికి గురై అతను తన ప్రాణాలు తీసుకున్నాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పూణెలో అనా సెబాస్టియన్​ మరణం..

ఇండియాలో వర్క్​ కల్చర్​పై గత 3,4 రోజులుగా సోషల్​ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం.. అనా సెబాస్టియన్​ అనే 26ఏళ్ల మహిళ! పూణెకు చెందిన ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తూ, వర్క్​ ప్రెజర్​ తట్టుకోలేక ఆమె మరణించిందని, ఆనా తల్లి చెప్పారు. ఈ విషయంపై కంపెనీకి ఓపెన్​ లెటర్​ రాశారు. తన బిడ్డ రాత్రింపగళ్లు, తిండి లేకుండా, నిద్ర లేకుండా పని చేసిందని అనా తల్లి చెప్పారు. వర్క్​ ప్రెజర్​ ఎక్కువగా ఉందని చాలాసార్లు తనకు చెప్పినట్టు పేర్కొన్నారు.

చివరికి.. ఉద్యోగంలోనే చేరిన 4 నెలలకే, ఈ ఏడాది జులైలో అనా సెబాస్టియన్​ మరణించింది.

సంబంధిత కథనం