తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Chetak Electric Scooter : సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- త్వరలోనే లాంచ్​!

Bajaj Chetak electric scooter : సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

31 December 2023, 15:30 IST

    • 2024 Bajaj Chetak Electric scooter : బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ అప్డేటెడ్​ వర్షెన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు..
సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్
సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్

సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్

2024 Bajaj Chetak Electric scooter : 2024ని గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో. ఈ నేపథ్యంలో.. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై ఓ క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ని రివీల్​ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాము..

2024 బజాజ్​ చేతక్​ ఈవీ..

ఈ అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​, మెకానికల్స్​లో భారీ మార్పులే కనిపిస్తాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్​లో 2.88 కేడబ్ల్యూహెచ్​ యూనిట్​ ఉంది. పైగా.. ప్రస్తుతం ఈ వెహికిల్​ రేంజ్​ 113 కి.మీలుగా ఉంది. ఇక బ్యాటరీ పెరుగుతుండటంతో.. బజాజ్​ చేతక్​ ఈవీ రేంజ్​ కూడా పెరుగుతుంది. దీని రేంజ్​ 130 కి.మీలుగా ఉంటుందని టాక్​ నడుస్తోంది.

Bajaj Chetak Electric scooter price in Hyderabad : లీక్​ అయిన డాక్యుమెంట్స్​ ప్రకారం.. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఛార్జింగ్​ టైమ్​ 4 గంటల 30 నిమిషాలు. ఆ సమయంలో 0-100శాతం పూర్తిగా ఛార్జింగ్​ అయిపోతుందట.

ఇక అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 73 కేఎంపీహెచ్​ అని తెలుస్తోంది.

సూపర్​ ఫీచర్స్​తో బజాజ్​ చేతక్​ ఈవీ..!

ఇక 2024 బజాజ్​ చేతక్​ ఈవీలో పలు ఆసక్తికరమైన ఫీచర్స్​ యాడ్​ అవుతున్నాయని సమాచారం. ఇందులో సరికొత్త టీఎఫ్​టీ స్క్రీన్​ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మోడల్స్​లో సర్క్యులర్​ ఎల్​సీడీ యూనిట్​ ఉంది.

Bajaj Chetak Electric scooter review : ఇక ఈ స్క్రీన్​లో టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, రిమోట్​ లాక్​- అన్​లాక్​, బ్లూటూత్​ కనెక్టివిటీతో పాటు మరిన్ని ఫీచర్స్​ కనిపిస్తాయని సమాచారం. 18 లీటర్లుగా బజాజ్​ చేతక్​ ఈవీ అండర్​ సీట్​ స్టోరేజ్​- 21 లీటర్లకు పెరిగిందట.

బజాజ్​ చేతక్​ ఈవీ ధర..

ప్రస్తుతం.. బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1.27లక్షలుగా ఉంది. ఇక అప్డేటెడ్​ వర్షెన్​ ధర ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని టాక్​ నడుస్తోంది.

2024 Bajaj Chetak EV : ఈ 2024 బజాజ్​ చేతక్​ ఈ- స్కూటర్​.. ఓలా ఎస్​1 ప్రో, టీవీఎస్​ ఐక్యూబ్​, ఏథర్​ 450ఎక్స్​తో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా.. ఈ మోడల్​కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. జనవరి 9న జరిగే ఈవెంట్​లో పూర్తి వివరాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం