తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Chetak Ev : భారీ మార్పులతో బజాజ్​ చేతక్​ ఈవీ- అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడంటే..

Bajaj Chetak EV : భారీ మార్పులతో బజాజ్​ చేతక్​ ఈవీ- అప్డేటెడ్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu

02 December 2023, 6:52 IST

    • Bajaj Chetak EV : బజాజ్​ చేతక్​ ఈవీ అప్డేటెడ్​ వర్షెన్​ రాబోతోంది. లాంచ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఈవీ.. త్వరలోనే లాంచ్​!
సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఈవీ.. త్వరలోనే లాంచ్​! (HT Auto)

సరికొత్తగా బజాజ్​ చేతక్​ ఈవీ.. త్వరలోనే లాంచ్​!

Bajaj Chetak EV : అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​​ ఈవీని త్వరలోనే ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది సంస్థ. అర్బేన్​, ప్రీమియం వేరియంట్లలో భారీ మార్పులే జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ అప్డేట్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

బజాజ్​ చేతక్​ ఈవీ..

కొత్త బజాజ్​ చేతక్​ ఈవీ డిజైన్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో.. ఇండిటేకర్​- మౌంటెడ్​ ఫ్రెంట్​ ఏప్రన్​, ఓవల్​ షేప్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​ విత్​ ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్​, ఫ్లాట్​ ఫుట్​బోర్డ్​, బాడీ కలర్డ్​ మిర్రర్స్​, డ్యూయెల్​ టోన్​ సీట్​, డిజైనర్​ 12 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, మెటాలిక్​ బాడీ పానెల్స్​ వస్తున్నాయి.

Bajaj Chetak EV price Hyderabad : ఇక అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అర్బేన్​ వేరియంట్​లో 2.88కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్​ వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 113 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుత మోడల్​లో 2.48 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది.

ఇక అప్డేటెడ్​ ప్రీమియం వేరియంట్​లో 3.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ వస్తుందట. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 126కి.మీల దూరం ప్రయాణిస్తుందట. ఈ మోడల్​లో ప్రస్తుతం 2.78 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది.

కాగా.. ఈ రెండు అప్డేటెడ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో నికిల్​ మాంగనీస్​ కోబాల్ట్​ బ్యాటరీలు ఉండనున్నాయి. ప్రస్తుతమైతే నికిల్​ కోబాల్ట్​ అల్యుమీనియం బ్యాటరీ ప్యాక్​ ఉంది.

బజాజ్​ చేతక్​ ఈవీ ధర ఎంత ఉంటుంది..?

Bajaj Chetak EV on road price Hyderabad : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ప్రస్తుతం బజాజ్​ చేతక్​ ఈవీ ఎక్స్​షోరూం ధర . 1.15లక్షలుగా ఉంది. అప్డేటెడ్​ మోడల్స్​ ధర దీని కన్నా కాస్త ఎక్కువే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా.. ఈ వెహికిల్స్​​ని డిసెంబర్​ చివర్లో లేదా జనవరి మొదటి వారంలో లాంచ్​ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోందని సమాచారం. లాంచ్​ టైమ్​లో.. ఈ మోడల్స్​ ఫీచర్స్​, ధరపై పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

తదుపరి వ్యాసం