New electric car : కళ్లు చెదిరే డిజైన్‌తో కొత్త ఎలక్ట్రిక్ సెడాన్.. హైఫై ఏ ఈవీ ఇదే!
21 November 2023, 6:28 IST
- HiPhi A electric sedan : హైఫై అనే చైనా సంస్థ నుంచి ఓ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ వస్తోంది. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కళ్లు చెదిరే డిజైన్‌తో కొత్త ఎలక్ట్రిక్ సెడాన్.. హైఫై ఏ ఈవీ ఇదే!
HiPhi A : ఇండియాతో పాటు అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. ఇక చైనాకు చెందిన హైఫై అనే ఆటోమొబైల్ సంస్థ.. కొత్త ఈవీని ఆవిష్కరించింది. దీని పేరు హైఫై ఏ. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎలక్ట్రిక్ కారు విశేషాలివే..
హైఫై ఏ అనేది ఒక ఎలక్ట్రిక్ సెడాన్. ఇదొక లగ్జరీ ఈవీ. హైఫై జెడ్ ఈవీ ఆధారంగా దీనిని రూపొందించింది సంస్థ. త్వరలో జరగనున్న గాంగ్జౌ ఆటో షోలో దీనిని ప్రదర్శించనుంది.
ఈ హైఫై ఏ ఎలక్ట్రిక్ సెడాన్‌లో 1,270 బీహెచ్పీ పీక్ పవర్‌ని జనరేట్ చేసే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టెమ్ ఉంటుంది. ఫలితంగా.. ఈ కారు టాప్ స్పీడ్ 300 కేఎంపీహెచ్గా ఉంది. 0- 96 కేఎంపీహెచ్ స్పీడ్‌ని కేవలం 2 సెకన్లలో అందుకోలగదట! అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2025 తొలినాళ్లల్లో ఈ ఈవీ సేల్కు వెళుతుంది.
HiPhi A electric car : ఈ హైఫై ఏ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 3 ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటయి. ఫ్రెంట్ ఆక్సిల్కి ఒకటి, రేర్ ఆక్సిల్కి రెండు ఫిట్ అయ్యి ఉంటాయి. ఈవీ డిజైన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్లను తామే స్వయంగా రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. ఈ మోడల్లో ఉపయోగిస్తున్న బ్యాటరీ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాకపోతే.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌లో పెద్ద బ్యాటరీనే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
2023 మార్చ్‌లో హైఫై జెడ్‌ని ఆవిష్కరించింది సంస్థ. అందులో ఉపయోగిస్తున్న ఎయిర్ సస్పెనన్ష్ సిస్టెమ్నే హైఫై ఏలోనూ వాడుతోంది. రేర్ స్టీరింగ్ సెటప్, అడాప్టివ్ డాంపర్స్, టార్క్ వెక్టరింగ్ సిస్టెమ్ వంటివి ఈ ఈవీకి లభిస్తున్నాయి.
HiPhi A electric price : ఇక ఈ హైఫై ఏ ఈవీ డిజైన్ ఫ్రెంట్ భాగం.. నిస్సాన్ జీటీ-ఆర్ సూపర్ కారును పోలి ఉంది. స్లాంట్- షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్లీక్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంటాయి. ఫ్రెంట్లో భారీ బ్లాక్ గ్రిల్ కూడా కనిపిస్తుంది. సాధారణంగా.. ఇలాంటి గ్రిల్స్.. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి ఉండవు. మొత్తం మీద.. ఓవరాల్ డిజైన్ చూస్తుంటే.. ఇదొక ఎలక్ట్రిక్ సెడాన్ కాకుండా హ్యాచ్‌బ్యాక్ ఫీల్ వస్తుంది. భారీ అలాయ్ వీల్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ హైఫై ఏ ఈవీ రేర్‌లో స్లీక్ ఎల్ఈడీ స్ట్రిప్ వస్తోంది. ఇదే టెయిల్గేట్గా పనిచేస్తుంది.
ఈ మోడల్ ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. త్వరలోనే వీటిపై క్లారిటీ రావొచ్చు.