తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi Electric Car : కొత్త ఎలక్ట్రిక్​ కారును రివీల్​ చేసిన షావోమీ..

Xiaomi electric car : కొత్త ఎలక్ట్రిక్​ కారును రివీల్​ చేసిన షావోమీ..

Sharath Chitturi HT Telugu

17 November 2023, 6:40 IST

google News
    • Xiaomi electric car : కొత్త ఎలక్ట్రిక్​ కారును రివీల్​ చేసింది షావోమీ సంస్థ. ఈ కారులో మూడు వేరియంట్స్​ ఉంటాయి. ఆ వివరాలు..
కొత్త ఎలక్ట్రిక్​ కారును రివీల్​ చేసిన షావోమీ..
కొత్త ఎలక్ట్రిక్​ కారును రివీల్​ చేసిన షావోమీ..

కొత్త ఎలక్ట్రిక్​ కారును రివీల్​ చేసిన షావోమీ..

Xiaomi SU7 EV : దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షావోమీ.. ఆటోమొబైల్​ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారును తాజాగా రివీల్​ చేసింది షావోమీ. ఈ మోడల్​ పేరు ఎస్​యూ7. ఈ నేపథ్యంలో.. ఈ కారుకు సంబంధించి, ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

షావోమీ కొత్త ఎలక్ట్రిక్​ కారు..

చైనాలో జరిగిన ఓ గ్రాండ్​ ఈవెంట్​లో.. తన తొలి ఈవీని ఆవిష్కరించింది షావోమీ. ఈ ఎస్​యూ7 అనేది ఒక ఎలక్ట్రిక్​ సెడాన్​. ఇందులో రెండు వర్షెన్స్​ ఉన్నాయి. రెండు ఇంజిన్​ ఆప్షన్స్​ (ఆర్​డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ) ఉన్నాయి. మూడు వేరియంట్లు ఈ మోడల్​ సొంతం. అవి.. ఎస్​యూ7, ఎస్​యూ7 ప్రో, ఎస్​యూ7 మ్యాక్స్​.

షావోమీ ఎస్​యూ7 ఆర్​డబ్ల్యూడీ వర్షెన్​లో సింగిల్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. ఇది.. 295బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఇక ఏడబ్ల్యూడీ ఇంజిన్​.. 663 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఈ ఏడబ్ల్యూడీ వర్షెన్​ ఫ్రెంట్​లో.. 295 బీహెచ్​పీ ఎలక్ట్రిక్​ మోటర్​, రేర్​లో 368 బీహెచ్​పీ ఎలక్ట్రిక్​ మోటార్​లు ఉంటాయి.

Xiaomi SU7 EV price : ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలు చూస్తుంటే.. షావోమీ కొత్త ఎలక్ట్రిక్​ కారు.. ప్రీమియం సెగ్మెంట్​ మోడల్​ని స్పష్టం అవుతోంది. కాగా.. మూడు వేరియంట్లలో ఎస్​యూ7 ధర కాస్త తక్కువగా ఉండొచ్చని, ఇందులో.. బీవైడీ సంస్థ తయారు చేసిన బ్యాటరీ ప్యాక్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. మిగిలిన వేరియంట్స్​లో భారీ బ్యాటరీ ప్యాక్స్​ ఉంటాయని సమాచారం.

షావోమీ ఎస్​యూ7 ఎలక్ట్రిక్​ వెహికిల్​ బరువు కూడా ఎక్కువే! దీని కర్బ్​ వెయిట్​ 1,980 కేజీలు. టాప్​ ఎండ్​ మోడల్​ బరువు ఏకంగా 2,205 కేజీలు.

బేస్​ వేరియంట్​ టాప్​ స్పీడ్​ 210 కేఎంపీహెచ్​గా ఉంది. మిగిలిన రెండు వేరియంట్ల టాప్​ స్పీడ్​ 265 కేఎంపీహెచ్​.

లాంచ్​ ఎప్పుడు?

Xiaomi SU7 EV price in India : షావోమీ ఎస్​యూ7 ప్రొడక్షన్​ ఈ ఏడాది డిసెంబర్​లో ప్రారంభం అవుతుందట! 2024 ఫిబ్రవరి నాటికి డెలివరీ మొదలవుతాయని తెలుస్తోంది. బీజింగ్​లో ఫ్యాక్టరీ ఇందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ట్రైల్​ ప్రొడక్ష్​ని కూడా నిర్వహించిందని సమాచారం. లాంచ్​ డేట్​పై క్లారిటీ లేదు.

ఈ ఎస్​యూ7లో.. హైపర్​ ఓఎస్​ అనే సాఫ్ట్​వేర్​ ఉండనుంది. గతవారమే.. ఈ హైపర్​ ఓఎస్​ని తన స్మార్ట్​ఫోన్స్​కు ప్రకటించింది షావోమీ.

Xiaomi electric car : షావోమీ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​కు సంబంధించిన ఫీచర్స్​, బ్యాటరీ ప్యాక్​, రేంజ్​ వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. వీటిని సంస్థ ప్రకటించాల్సి ఉంది. లాంచ్​ తర్వాత మాత్రం, ప్రీమియం సెగ్మెంట్​ కేటగిరీలో ఈ మోడల్​ దూసుకెళుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఇండియాలోకి ఈ షావోమీ ఎస్​యూ7 ఎంట్రీ ఇస్తుందా? లేదా? అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం