Maruti Suzuki electric car : మారుతీ సుజుకీ తొలి ఈవీ.. ఇదిగో!
11 November 2023, 12:00 IST
- Maruti Suzuki eVX : టెస్ట్ రన్ దశలో ఉన్న మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు..
మారుతీ సుజుకీ తొలి ఈవీ.. ఇదిగో!
Maruti Suzuki eVX : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది. కానీ.. ఈ సెగ్మెంట్లో ఇప్పటికీ ఒక్క మోడల్ని కూడా లాంచ్ చేయలేదు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. ఈ లోటును భర్తీ చేసేందుకు గట్టి ప్లాన్లే వేసింది. ఇందులో భాగంగా.. ఈవీఎక్స్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్ని ప్రదర్శించింది. ఆ తర్వాత.. అనేక దేశాల్లో ఈ ఎస్యూవీ చక్కర్లు కొడుతూ కనిపించింది. తాజాగా.. ఇండియా రోడ్లపైనా ఈ ఈవీ దర్శనమిచ్చింది. టెస్ట్ రన్ దశలో ఉన్న ఈ కారు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్..
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ టెస్ట్ రన్ ఇటీవలే ఇండియాలో జరిగింది. కాగా.. వెహికిల్ మొత్తానికీ బ్లాక్ టేప్ కట్టి, టెస్ట్ రన్ నిర్వహించింది మారుతీ సుజుకీ. ఇతర వాహనాల టెస్ట్ రన్ కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఫలితంగా.. ఈ మోడల్ కీలకమైన ఫీచర్స్ రివీల్ అవ్వలేదు. ఫొటోలను చూస్తే.. ఫ్రెంట్ డిజైన్‌లోని హెడ్‌ల్యాంప్ మాత్రమే కనిపిస్తోంది.
Maruti Suzuki eVX electric : ఈ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది మారుతీ సుజుకీ. ఇందుని వీల్స్ కార్నర్స్‌లో ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్‌పై బ్యాటరీలు ఉంటాయి. ఫలితంగా కేబిన్‌లో స్పేస్ మరింత పెరుగుతుంది.
ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్ పొడవు 4,300ఎంఎం. వెడల్పు 1,800ఎంఎం. ఎత్తు 1,600ఎంఎం. ఇందులో 60 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ఉంటుందని ఇదివరకే చెప్పింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీని రేంజ్ 550 కిలోమీటర్ ఉంటుందని వెల్లడించింది.
Maruti Suzuki eVX launch in India : ఇటీవలే జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ఈ ఈవీఎక్స్ ఈవీని ప్రదర్శించింది సంస్థ. ఇంటీరియర్‌లో డ్యూయెల్ స్క్రీన్ సెటప్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, సింగల్ ఫరీస్టాండింగ్ యునిట్, ఫ్లాట్ బాటమ్ స్పోర్టీ స్టీరింగ్ వీల్, రోటరీ డయల్స్, టచ్ ప్యానెల్స్ వంటివి ఉంటాయని సమాచారం.
ఇండియాలో.. ఈ మారుతీ సుజుకీ ఈవీఎక్స్.. 2025లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
కొత్త ఫీచర్స్‌తో సుజుకీ డిజైర్..!
2024 స్విఫ్ట్‌తో పాటు 2024 డిజైర్‌ని కూడా సిద్ధం చేస్తోంది మారుతీ సుజుకీ సంస్థ. 2024 మారుతీ సుజుకీ డిజైర్ 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ ఉండనుంది. వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్-ఇన్ నేవిగేషన్‌తో పాటు ఇతర కూల్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.