Simple Dot One : 150కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింపుల్ డాట్ వన్ లాంచ్ డేట్ ఇదే!
Simple Dot One electric scooter : సింపుల్ ఎనర్జీ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్‌కు సిద్ధమైంది. ఆ వివరాలను సంస్థ తాజాగా వెల్లడించింది.
Simple Dot One electric scooter : సింపుల్ ఎనర్జీ సంస్థ నుంచి సరికొత్త, చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. దీని పేరు సింపుల్ డాట్ వన్. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో.. ఈ మోడల్, డిసెంబర్ 15న లాంచ్కానుంది. బుకింగ్స్ కూడా అదే రోజున ప్రారంభంకానున్నాయి. ఈ విషయాలని సంస్థ తాజాగా ప్రకటించింది.
సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు..
సింపుల్ ఎనర్జీ సంస్థకు ఇప్పటికే మార్కెట్లో రెండు ఈవీలు ఉన్నాయి. వీటిల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇక డిసెంబర్లో లాంచ్‌కానున్న సింపుల్ డాట్ వన్.. ఈ సింపుల్ వన్‌కు సబ్-వేరియంట్‌గా ఉండనుంది. ఫలితంగా.. సింపుల్ వన్ని రూపొందించిన ఫ్లాట్‌ఫామ్‌పైనే.. కొత్త వెహికిల్‌ని కూడా తయారు చేస్తోంది సంస్థ.
Simple Dot One price : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 151 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. మైలేజ్ పెరిగే విధంగా.. ఈ వెహికల్ టైర్లను ప్రత్యేకంగా రూపొందించినట్టు సంస్థ స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాప్ కనెక్టివిటీ సపోర్ట్‌తో పాటు ఇతర ఫీచర్స్ కూడా ఉండనున్నాయి.
సింపుల్ డాట్ వన్ ధర ఎంత?
ఈ సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ .1.45లక్షలుగా ఉంటుందని మార్కెట్లో టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే.. భారతీయులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్షన్ లభించినట్టు అవుతుందని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Simple Dot One price in Hyderabad : ఇక ఈ సింపుల్ డాట్ వన్ మోడల్ డెలివరీలు 2024 జనవరిలో మొదలవుతాయని తెలుస్తోంది. ఇతర వివరాలపై.. లాంచ్ డేట్‌లోపు ఓ క్లారిటీ వస్తుంది.
ఇండియాలోకి మరో ఈవీ..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై మరో అంతర్జాతీయ సంస్థ కన్నేసింది. తైవాన్‌కు చెందిన గొగొరో సంస్థ.. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయనుంది. ఈ స్కూటర్ పేరు గొగొరో క్రాస్ఓవర్ ఈవీ! డిసెంబర్లోనే ఈ ఈవీ లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ గొగొరో క్రాస్ఓవర్ ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొదలైందని సమాచారం. తొలుత.. బీ2బీ పార్ట్నర్స్కి ఈ వెహికిల్‌ని సరఫరా చేయనుంది సంస్థ. 2024 తొలినాళ్లల్లో డెలివరీలు మొదలవ్వొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం