Gogoro Crossover EV : ఇండియాలోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే!
Gogoro Crossover EV : గొగొరా అనే తైవాన్ సంస్థ.. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంస్థ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలోనే లాంచ్కానుంది.
Gogoro Crossover EV : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై మరో అంతర్జాతీయ సంస్థ కన్నేసింది. తైవాన్‌కు చెందిన గొగొరో సంస్థ.. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయనుంది. ఈ స్కూటర్ పేరు గొగొరో క్రాస్ఓవర్ ఈవీ! డిసెంబర్లోనే ఈ ఈవీ లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్కూటర్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
గొగొరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ గొగొరో క్రాస్ఓవర్ ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొదలైందని సమాచారం. తొలుత.. బీ2బీ పార్ట్నర్స్కి ఈ వెహికిల్‌ని సరఫరా చేయనుంది సంస్థ. 2024 తొలినాళ్లల్లో డెలివరీలు మొదలవ్వొచ్చు.
ఈ గొగొరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో టూ వీలర్ 'ఎస్యూవీ'గా గుర్తింపు లభించింది. యుటిలిటీ, అడాప్టెబులిటీని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ని తయారు చేసినట్టు సంస్థ చెప్పుకొచ్చింది.
Gogoro Crossover EV launch in India : ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎలాంగేటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ష్రౌడ్ వంటివి ఉంటాయి. 12 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి వస్తాయి. రెండు వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- New electric car : కళ్లు చెదిరే డిజైన్‌తో కొత్త ఎలక్ట్రిక్ సెడాన్.. హైఫై ఏ ఈవీ ఇదే!
ఈ కొత్త ఈవీ కర్బ్ వెయిట్ 126కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 142ఎంఎం. వీల్‌బేస్ 1,400ఎంఎం. ఇక ఈ గొగొరో క్రాస్ఓవర్ స్కూటర్లోని ప్యాసింజర్ సీట్‌ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అవసరమైతే ఆ ప్లేస్‌లో కార్గోని పెట్టుకోవచ్చు. లేదా దానిని పూర్తిగా తీసేవచ్చు కూడా! ఫ్రెంట్, రేర్ లగేజ్ ర్యాక్స్, టాప్ కేసెస్ వంటి ఎక్స్ట్రా యాక్ససరీస్ని కూడా సంస్థ ఇచ్చే అవకాశం ఉంది.
రేంజ్ ఎంతంటే..
Gogoro India : ఈ స్కూటర్లో 1.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ మోడల్ రేంజ్ దాదాపు 100కి.మీలుగా ఉంటుంది.
ఇండియాలో వేగంగా ఎదిగేందుకు భారీగా ప్లాన్ చేసింది గొగోరో. మహారాష్ట్రలో రూ. 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుకి సిద్ధమైంది. స్విగ్గీ, జొమాటోతో పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకుంది.
Gogoro Crossover EV price in India : ఇక ఢిల్లీ- ఎన్సీఆర్లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్‌ని కూడా గొగొరో ఏర్పాటు చేసింది. 2024 మధ్య నాటికి ఫుల్-స్కేల్ బ్యాటరీ ప్రొడక్షన్‌ని చేపట్టాలని నిర్ణయించుకుంది.
ఈ గొగొరో క్రాస్ఓవర్ ఈవీ ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం