Hero maxi scooter : హీరో మోటోకార్ప్ కొత్త అడ్వెంచర్ స్కూటర్.. జూమ్ 160 ఇదిగో!
Hero maxi scooter : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త స్కూటర్ లాంచ్కానుంది. ఈ జూమ్ 160 అడ్వెంచర్ స్కూటర్ విశేషాలివే..
Hero Xoom 160 : హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి సరికొత్త స్కూటర్ రాబోతోంది. దీని పేరు హీరో జూమ్ 160 అడ్వెంచర్ మ్యాక్సీ- స్కూటర్. త్వరలోనే జరగనున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్లో ఈ మోడల్ని ఆవిష్కరించనుంది హీరో మోటోకార్ప్. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
హీరో కొత్త స్కూటర్ విశేషాలివే..
హీరో జూమ్ 160 ఏడీవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. బ్రాండ్ న్యూ సెగ్మెంట్లో ఈ స్కూటర్ ఉంటుందని తెలుస్తోంది. అడ్వెంచర్ స్కూటర్స్ సెగ్మెంట్లో హోండా, ఏప్రీలియా వాహనాలు ఉన్నాయి. ఇక ఈ సెగ్మెంట్లోకి ఎంట్రీ కోసం గ్రాండ్‌గా ప్లాన్ చేసింది హీరో సంస్థ. ఈ మోడల్‌కు ఇండియాతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ భావిస్తోంది.
ఈ హీరో జూమ్ 160 ఏడీవీని జూమ్ 110 ఆధారంగా రూపొందించినట్టు కనిపిస్తోంది. కాకపోతే ఇది ప్రీమియంగా, మరింత అడ్వెంచర్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్లో టాల్ ఏప్రాన్, ట్విన్ హెడ్‌ల్యాంప్స్, టాల్ విండ్‌స్క్రీన్, భారీ అలాయ్ వీల్స్, డ్యూయెల్ పర్పస్ టైర్స్ వంటివి వస్తున్నాయి. కార్నరింగ్ ల్యాంప్స్, స్టెప్-అప్ సింగిల్ సీట్, అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్, ఫ్రెంట్ ఫోక్స్, డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ కూడా దీని సొంతం అవ్వొచ్చు.
Hero Xoom 160 maxi scooter : హీరో జూమ్ 160 మ్యాక్సీ స్కూటర్లో 163సీసీ, ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, 4 వాల్స్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. సరికొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీలో కూడా ఇదే ఇంజిన్ ఉంటుంది. ఇది 16.6 బీహెచ్పీ పవర్‌ని, 14.6 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- New electric bike : అల్ట్రావయోలెట్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్..
ఈ స్కూటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్- ఎస్ఎంఎస్ అలర్ట్, రైడర్ టెలీమాటిక్స్తో పాటు ఇతర ఫీచర్స్ ఉండొచ్చు.
Hero Maxi adventure scooter : లాంచ్ తర్వాత.. ఈ హీరో జూమ్ 160 అడ్వెంచర్ మ్యాక్సీ స్కూటర్.. ఏప్రీలియా ఎస్ఆర్ 160, ఎస్ఎక్స్ఆర్ 160, యమహా ఏరోక్స్ 155 వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
2024 తొలినాళ్లల్లో ఈ స్కూటర్ ఇండియాలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. హీరో ప్రీమియా డీలర్షిప్షోరూమ్స్ ద్వారా వీటిని సంస్థ సేల్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట!
సంబంధిత కథనం