Bajaj Chetak EV : భారీ మార్పులతో బజాజ్ చేతక్ ఈవీ- అప్డేటెడ్ వర్షెన్ లాంచ్ ఎప్పుడంటే..
Bajaj Chetak EV : బజాజ్ చేతక్ ఈవీ అప్డేటెడ్ వర్షెన్ రాబోతోంది. లాంచ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Bajaj Chetak EV : అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఈవీని త్వరలోనే ఇండియా మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది సంస్థ. అర్బేన్, ప్రీమియం వేరియంట్లలో భారీ మార్పులే జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ అప్డేట్స్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
బజాజ్ చేతక్ ఈవీ..
కొత్త బజాజ్ చేతక్ ఈవీ డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో.. ఇండిటేకర్- మౌంటెడ్ ఫ్రెంట్ ఏప్రన్, ఓవల్ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్ విత్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, బాడీ కలర్డ్ మిర్రర్స్, డ్యూయెల్ టోన్ సీట్, డిజైనర్ 12 ఇంచ్ అలాయ్ వీల్స్, మెటాలిక్ బాడీ పానెల్స్ వస్తున్నాయి.
Bajaj Chetak EV price Hyderabad : ఇక అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బేన్ వేరియంట్లో 2.88కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 113 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుత మోడల్లో 2.48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది.
ఇక అప్డేటెడ్ ప్రీమియం వేరియంట్లో 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వస్తుందట. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 126కి.మీల దూరం ప్రయాణిస్తుందట. ఈ మోడల్లో ప్రస్తుతం 2.78 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది.
కాగా.. ఈ రెండు అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో నికిల్ మాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీలు ఉండనున్నాయి. ప్రస్తుతమైతే నికిల్ కోబాల్ట్ అల్యుమీనియం బ్యాటరీ ప్యాక్ ఉంది.
బజాజ్ చేతక్ ఈవీ ధర ఎంత ఉంటుంది..?
Bajaj Chetak EV on road price Hyderabad : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం బజాజ్ చేతక్ ఈవీ ఎక్స్‌షోరూం ధర . 1.15లక్షలుగా ఉంది. అప్డేటెడ్ మోడల్స్ ధర దీని కన్నా కాస్త ఎక్కువే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా.. ఈ వెహికిల్స్‌ని డిసెంబర్ చివర్లో లేదా జనవరి మొదటి వారంలో లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోందని సమాచారం. లాంచ్ టైమ్‌లో.. ఈ మోడల్స్ ఫీచర్స్, ధరపై పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత కథనం