తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Tata Safari Price : హైదరాబాద్​లో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

2023 Tata Safari price : హైదరాబాద్​లో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

20 October 2023, 7:20 IST

google News
    • 2023 Tata Safari price : 2023 టాటా సఫారీ వర్షెన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. హైదరాబాద్​లో ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..
హైదరాబాద్​లో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

హైదరాబాద్​లో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

2023 Tata Safari on road price Hyderabad : టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గా ఉన్న హారియర్​, సఫారీకి సంబంధించిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ తాజాగా లాంచ్​ అయ్యింది. ముఖ్యంగా 2023 టాటా సఫారీకి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీలోని వేరియంట్లు, హైదరాబాద్​లో వాటి ఆన్​రోడ్​ ప్రైజ్​ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2023 టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

ఇండియాలో టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ ఎక్స్​షోరూం ధర రూ. 16.19లక్షల వద్ద ప్రారంభమవుతోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్​లో ఈ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను చూద్దాము..

సఫారీ స్మార్ట్​ (ఓ):- రూ. 19,49,876

సఫారీ ప్యూర్​ (ఓ):- రూ. 21,30, 476

సఫారీ అడ్వెంచర్​ ప్లస్​ ఏ:- రూ. 24,75,124

సఫారీ అడ్వెంచర్​ ప్లస్​ ఏటీ:- రూ. 24,75,124

2023 Tata Safari facelift : సఫారీ అడ్వెంచర్​ ప్లస్​ డార్క్​ ఎడిషన్​:- రూ. 24.75లక్షలు

సఫారీ అకంప్లీష్​డ్​ డార్క్​ ఎడిషన్​:- రూ. 24.75లక్షలు

సఫారీ అకంప్లీష్​డ్​ ప్లస్​ డార్క్​ ఎడిషన్​:- రూ. 24.75లక్షలు

సఫారీ అడ్వెంచర్​:- రూ. 25.11లక్షలు

సఫారీ అడ్వెంచర్​ ప్లస్​:- రూ. 26.90లక్షలు

సఫారీ అకంప్లీష్​డ్​:- రూ. 28.70లక్షలు

సఫారీ అకంప్లీష్​డ్​ ప్లస్​:- రూ. 30.49లక్షలు

(ఎక్స్​షోరూం ప్రైజ్​- ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. పూర్తి వివరాల కోసం మీ దగ్గరిలోని టాటా మోటార్స్​ డీలర్​షిప్​ షోరూమ్​ను సందర్శించాల్సి ఉంటుంది.)

కొత్త ఎస్​యూవీ ఫీచర్స్​ ఇవే..

Tata Safari facelift on road price : టాటా సఫారీ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​, ఆండ్రాయిట్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, టచ్​ ఆధారిత హెచ్​వీఏసీ కంట్రోల్స్​, 4 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, వయర్​లెస్​ ఛార్జర్​, యాంబియెంట్​ మూడ్​ లైటింగ్​, డిస్​ప్లేతో కూడిన టెర్రైన్​ రెస్పాన్స్​ సిస్టెమ్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, రేర్​ డోర్​ సన్​ షేడ్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​ వంటివి లభిస్తున్నాయి.

ఇక ఈ ఎస్​యూవీలో 2.0 లీటర్​ క్రియోటెక్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 168 హెచ్​పీ పవర్​ను 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్​ ఉంటుంది.

Tata Safari facelift 2023 price : ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​..కాస్మిక్​ గోల్డ్​, గలాక్టిక్​ సఫైర్​, లూనార్​ స్లేట్​, ఒబేరన్​ బ్లాక్​, స్టార్​డస్ట్​ వంటి కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

ఈ మోడల్​ కొన్ని రోజుల ముందే లాంచ్​ అవ్వగా.. బుకింగ్స్​ చాలా రోజు క్రితమే మొదలయ్యాయి. రానున్న రోజుల్లో డెలివరీలను ప్రారంభించాలని టాటా మోటార్స్​ ప్లాన్​ చేస్తోంది.

తదుపరి వ్యాసం