Citroen C3 Aircross on road price : హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధర ఎంతంటే..
30 October 2023, 16:09 IST
- Citroen C3 Aircross on road price Hyderabad : సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ మోడల్ వేరియంట్లు, వాటి ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్‌లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధర ఎంతంటే..
Citroen C3 Aircross on road price Hyderabad : సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్యూవీ.. ఇండియాలో ఇటీవలే లాంచ్ అయ్యింది. 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో వస్తున్న ఈ వెహికిల్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలు- రూ. 11.99లక్షల మధ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హైదరాబాద్‌లో ధరల వివరాలు..
సీ3 ఎయిర్‌క్రాస్ యూ 1.2 5 ఎస్టీఆర్- రూ. 11.92లక్షలు
ప్లస్ 1.2 5 ఎస్టీఆర్- రూ. 13.97లక్షలు
ప్లస్ 1.2 7 ఎస్టీఆర్- రూ. 14.39లక్షలు
మ్యాక్స్ 1.2 5 ఎస్టీఆర్- రూ. 14.76లక్షలు
మ్యాక్స్ 1.2 7 ఎస్టీఆర్- రూ. 15.18లక్షలు
Citroen C3 Aircross price : ఇక ముంబైలో ఈ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 11.65లక్షలు- రూ. 14.60లక్షల మధ్యలో ఉంది. ఢిల్లీలో ఇది రూ. 11.27లక్షలు- రూ. 14.36లక్షలుగా ఉంది. చెన్నైలో అయితే సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆన్ రోడ్ ప్రైజ్ రూ. 11.54లక్షలు- రూ. 14.95లక్షలుగా కొనసాగుతోంది.
కాగా.. పైన చెప్పిన ఎక్స్‌షోరూం ధర.. ఇంట్రొడక్టరీ ప్రైజ్ అని సంస్థ చెప్పింది. భవిష్యత్తులో ఈ ధరలు పెరగొచ్చు. ఎక్స్‌షోరూం ధర పెరిగితే.. ఆటోమెటిక్‌గా ఆన్‌రోడ్ ప్రైజ్ కూడా పెరుగుతుంది.
కొత్త ఎస్యూవీ విశేషాలివే..
సంస్థకు చెందిన డీలర్షిప్షోరూమ్స్లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్టు సిట్రోయెన్ సంస్థ చెబుతోంది.
Citroen C3 Aircross Hyderabad : ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లోని మూడో రోలో రెండు సీట్లు ఉంటాయి. అవసరమైతే వీటిని ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా పూర్తిగా తొలగించొచ్చు.
ఇక ఈ ఎస్‌యూవీలో 1.2 లీటర్ ప్యూర్‌టెక్110 ఇంజిన్ ఉంటుంది. ఇది 108 హెచ్‌పీ పవర్‌ను, 190 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ దీని సొంతం. ఆటోమెటిక్ ట్రాన్స్‌మీషన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ వెహికిల్ మైలేజ్ 18.5 కేఎంపీఎల్ అని సంస్థ చెబుతోంది.
Citroen C3 Aircross mileage : కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, వోక్స్వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజ్ హైరైడర్, హోండా ఎలివేట్ వంటి మోడల్స్‌కు ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్.. గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ మోడల్‌పై సంస్థ భారీ అంచనాలే పెట్టుకుంది.