తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3 Aircross : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వేరియంట్లు- వాటి ధరలు..

Citroen C3 Aircross : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వేరియంట్లు- వాటి ధరలు..

Sharath Chitturi HT Telugu

17 September 2023, 11:45 IST

google News
    • Citroen C3 Aircross : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​లో ఎన్ని వేరియంట్లు ఉన్నాయి? వాటి ధరలెంత? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వేరియంట్లు- వాటి ధరలు..
సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వేరియంట్లు- వాటి ధరలు..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వేరియంట్లు- వాటి ధరలు..

Citroen C3 Aircross price : ఫ్రాన్స్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ సిట్రోయెన్​.. తాజాగా ఓ మోడల్​ను ఇండియాలో లాంచ్​ చేసింది. అదే సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​. ఈ ఎస్​యూవీకి సంబంధించిన బుకింగ్స్​ శుక్రవారమే ప్రారంభమయ్యాయి. 5 సీటర్​, 7 సీటర్​ కాన్ఫిగరేషన్​లో ఈ మోడల్​ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్​ వేరియంట్లు, వాటి ధరలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎస్​యూవీ వేరియంట్లు, వాటి ధరలు..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ యూ- రూ. 9.99లక్షలు

ప్లస్​- రూ. 11.50లక్షలు- రూ. 11.45లక్షలు

మ్యాక్స్​- రూ. 11.95లక్షలు- 12.10లక్షలు

Citroen C3 Aircross SUV : 5+2 ఫ్లెక్సీ ప్రో (ప్లస్​- మ్యాక్స్​)- రూ. 35వేలు అదనం

డ్యూయెల్​ టోన్​ (ప్లస్​- మ్యాక్స్​)- రూ. 20వేలు అదనం

వైబ్​ ప్యాక్​ (ప్లస్​- మ్యాక్స్​)- రూ. 25వేలు అదనం

* పైన చెప్పిన ధరలు.. ఎక్స్​షోరూం ధరలు మాత్రమే. ఆన్​ రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

హైదరాబాద్​లో సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:- ఈ మహీంద్రా ఎస్​యూవీలపై రూ. 1.25లక్షల వరకు భారీ డిస్కౌంట్లు..!

సిట్రోయెన్​ కొత్త వెహికిల్​ బుకింగ్స్​ షురూ..

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ను రూ. 25వేల టోకెన్​ అమౌంట్​తో సంస్థకు చెందిన వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్​లో బుక్​ చేసుకోవచ్చు. అక్టోబర్​ 15 నుంచి డెలివరీలు మొదలుపెట్టాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది.

Citroen C3 Aircross price Hyderabad : ఇండియాలో.. కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో 3- రో సీటింగ్​​ ఆప్షన్​ కలిగి ఉన్న తొలి వెహికిల్​ ఈ సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ కావడం విశేషం. హ్యుందాయ్​ క్రేటా, కియా సెల్టోస్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా వంటి మోడల్స్​కు ఈ ఎస్​యూవీ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ వెహికిల్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 108 హెచ్​పీ పవర్​ను, 190 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ ఎస్​యూవీ.. 18.5 కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం కేవలం 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఆప్షన్​ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ కూడా రావొచ్చు.

Citroen C3 Aircross on road price in Hyderabad : ఈ సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వెడల్పు 1,799. పొడవు 4,323. ఎత్తు 1,699. వీల్​బేస్​ 2,671ఎంఎం.

తదుపరి వ్యాసం