Toyota Rumion variants : టయోటా రుమియన్ వేరియంట్లు.. వాటి ఫీచర్స్ ఇవే!
12 August 2023, 6:47 IST
- Toyota Rumion variants : టయోటా రుమియన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్లోని వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము…
టయోటా రుమియన్ వేరియంట్లు.. వాటి ఫీచర్స్ ఇవే!
Toyota Rumion variants : మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారిత రుమియన్ ఎంపీవీని ఇటీవలే ఇండియాలో రివీల్ చేసింది టయోటా మోటార్స్. సంస్థ నుంచి వస్తున్న అతి చౌకైన ఎంపీవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంటుందని టయోటా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ టయోటా రుమియన్ వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఎన్ని వేరియంట్లు ఉన్నాయి..?
టయోటా రుమియన్‌లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. ఇవి ఐదు రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. అవి కేఫ్ వైట్, స్పంకీ బ్లూ, ఐకానిక్ గ్రే, రస్టిక్ బ్రౌన్, ఎంటైసింగ్ సిల్వర్.
ఎస్ వేరియంట్:- ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ సరౌండింగ్ గ్రిల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, బాడీ కలర్డ్ ఓఆర్వీఎంలు, డిజైనర్ కవర్స్‌తో కూడిన స్టీల్ వీల్స్ వస్తున్నాయి.
Toyota Rumion on road price Hyderabad : ఇక 7 సీటర్ కేబిన్‌లో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, మేన్యువల్ ఏసీ విత్ రూఫ్ మౌంటెడ్ ఎయిర్ వెంట్స్, ఎయిర్ కూల్డ్ ట్విన్ కప్ హోల్డర్స్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, 4 స్పీకర్ ఆడియో, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.
ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 హెచ్‌పీ పవర్‌ను, 136.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదే ఇంజిన్‌లో సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. ఇది 87 హెచ్‌పీ పవర్‌ను, 121 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- క్రేజీ అప్డేట్స్తో 2024 టయోటా వెల్ఫైర్ ఎంపీవీ లాంచ్..!
జీ వేరేయింట్:- టయోటా రుమియన్ జీ వేరియంట్లో బేస్ మోడల్లోని ఫీచర్స్‌తో పాటు బూట్ లిడ్- డోర్ హాండిల్స్కు క్రోమ్ ఇన్సర్ట్స్, డ్యూయెల్ టోన్ వీల్స్, ఫ్రెంట్- రేర్ మడ్‌గార్డ్స్ లభిస్తున్నాయి. హైట్ అడ్జెస్టెబుల్ సీట్, డాష్‌బోర్డ్‌పై మెటాలిక్ టీక్ ఉడ్, స్మార్ట్ కీ, ఆర్కెమిస్ సౌండ్ సిస్టెమ్ వంటివి వస్తున్నాయి.
ఇందులోనూ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ దీని సొంతం.
Toyota Rumion MPV specifications : వీ వేరియంట్:- ఈ రుమియన్ ఎంపీవీ వీ వేరియంట్.. ఒక టాప్ ఎండ్ మోడల్. ఇందులో బేస్ మోడల్లోని ఫీచర్స్‌తో పాటు అదనంగా అనేక ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఆటోమెటిక్ హెడ్‌ల్యాంప్స్, కీ- ఆపరేటెడ్ రిట్రాక్టెబుల్ ఓఆర్వీఎంలు, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, క్రూజ్ కంట్రోల్, 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, టయోటా ఐ కనెక్ట్ టెక్నాలజీ వంటివి వస్తున్నాయి.
ఇందులోనూ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కాగా.. 5 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లభిస్తుంది.
వీటి ధరలెంత..?
Toyota Rumion price details : టయోటా రుమియన్ ఎంపీవీ ధరలపై ఇంకా క్లారిటీ లేదు. సెప్టెంబర్‌లో జరిగే లాంచ్ ఈవెంట్లో స్పష్టత వస్తుంది. కాగా.. ప్రస్తుతం మార్కెట్లో మారుతీ సుజుకీ ఎర్టిగా ఎక్స్‌షోరూం ధర (రూ. 8.64లక్షలు- రూ. 13.08లక్షలు) కన్నా ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.