తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota C Hr Suv : 2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన టయోటా..

Toyota C HR SUV : 2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన టయోటా..

Sharath Chitturi HT Telugu

26 June 2023, 15:19 IST

    • Toyota C HR SUV : 2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని తాజాగా రివీల్​ చేసింది టయోటా సంస్థ. యూరోప్​లో బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు..
2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన టయోటా..
2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన టయోటా.. (Toyota)

2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన టయోటా..

Toyota C HR SUV : 2024 సీ- హెచ్​ఆర్​ ఎస్​యూవీని తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. యూరోప్​లో ఈ మోడల్​ బుకింగ్స్​ మొదలయ్యాయి. ఈ ఎస్​యూవీ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సీ హెచ్​ఆర్​ ఎస్​యూవీ స్పెసిఫికేషన్స్​..

ఈ టయోటా ఎస్​యూవీకి సూపర్​ కూపే ప్రొఫైల్​ ఉంటుంది. ఇందులో మస్క్యులర్​ హుడ్​, సీ షేప్​ స్వెప్ట్​ బ్యాక్​ హెడ్​లైట్స్​, వైడ్​ బంపర్​, డైమెంట్​ కట్​ లైన్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, 20 ఇంచ్​ స్టైలిష్​ వీల్స్​ వంటివి లభిస్తున్నాయి.

ఇక రేర్​లో షార్క్​ ఫిన్​ యాంటీనా, ఫుల్​ విడ్త్​ టెయిల్​ల్యాంప్​లు వస్తున్నాయి.

టయోటా సీ హెచ్​ఆర్​ ఫీచర్స్​ ఇవే..

సెకండ్​ జనరేషన్​ టయోటా సీ- హెచ్​ఆర్​ ప్రీమియం కేబిన్​లో రీసైకిల్డ్​ ప్లాస్టిక్​తో తయారు చేసిన అప్​హోలిస్ట్రీ, ఇన్​ఫ్రారెడ్​ రెడ్యూసింగ్​ కోటింగ్​తో కూడిన పానోరమిక్​ సన్​రూఫ్​ వంటివి వస్తున్నాయి. ఈ కోటింగ్​తో వేసవి కాలంలో ఓవర్​హింట్​ నుంచి శీతాకాలంలో ఓవర్​కూలింగ్​ నుంచి రక్షణ లభిస్తుందని సంస్థ చెబుతోంది. సర్క్యులర్​ ఏసీ వెంట్స్​, 3 స్పోక్​ మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​​ వంటివి లభిస్తున్నాయి.

Toyota C HR SUV hybrid : అంతేకాకుండా ఈ ఎస్​యూవీలో 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, హెడ్​-అప్​ డిస్​ప్లే, జేబీఎల్​ సౌండ్​ సిస్టెమ్​, డిజిటల్​ కీ వంటివి కూడా వస్తున్నాయి. 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి సైతం ఉన్నాయి.

ఇక సేఫ్టీ కోసం లేన్​ ఛేంజింగ్​ అసిస్ట్​, ఫ్రెంట్​ క్రాస్​ ట్రాఫిక్​ అలర్ట్​, ప్రోయాక్టివ్​ డ్రైవింగ్​ అసిస్ట్​ వంటి టయోటా సేఫ్టీ సెన్స్​ ఏడీఏఎస్​లు లభిస్తున్నాయి.

టయోటా సీ హెచ్​ఆర్ ఇంజిన్​ వివరాలు..

ఈ కొత్త ఎస్​యూవీలో 140 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే 1.8 లీటర్​ హైబ్రీడ్​, 198 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే 2.0 లీటర్​ హైబ్రీడ్​, 223 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఆప్షన్లు ఉన్నాయి.

Toyota C HR SUV price : 2024 టయోటా సీ-హెచ్​ఆర్​ ఎక్స్​షోరూం ధర 35,000 పౌండ్లుగా ఉండొచ్చు. అంటే.. సుమారు రూ. 36.5లక్షలు. యూరోప్​లోనే దీనిని డెవలప్​చేసి విక్రయిస్తోంది సంస్థ.

టయోటా వెల్​ఫైర్​..

జపాన్​కు చెందిన టయోటా సంస్థ మంచి జోరు మీద ఉంది. కొత్త మోడల్స్​తో పాటు అప్డేటెడ్​ వర్షెన్​లను లాంచ్​ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. 2024 టయోటా వెల్​ఫైర్​ ప్రీమియం ఎంపీవీని సంస్థ ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ ఫోర్త్​ జనరేషన్​ ఎంపీవీకి క్రేజీ అప్డేట్స్​ లభించాయి.

ఫోర్త్​ జనరేషన్​ వెల్​ఫైర్​ ప్రీమియం ఎంపీవీని లాంచ్​ చేసింది టయోటా మోటార్స్​. డిజైన్​ పరంగా చాలా అప్డేట్స్​ కనిపిస్తున్నాయి. ఫ్రెంట్​ బంపర్​ లుక్​ చాలా అగ్రెసివ్​గా ఉంది. గ్రిల్​పై వర్టికల్​ స్లేట్స్​ వస్తున్నాయి. 2024 టయోటా వెల్​ఫైర్​లో రెండు పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 260 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే 2.4 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఒకటి. 260 హెచ్​ప పవర్​ను జనరేట్​ చేసే 2.5 లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఒకటి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం