Citroen C3 Aircross price : సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధర ఎంతంటే..!
Citroen C3 Aircross price : సిట్రోయెన్ సీ3 ధర రివీల్ అయ్యింది. ఈ మోడల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు..
Citroen C3 Aircross price : సీ3 ఎయిర్‌క్రాస్‌ను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది సిట్రోయెన్ సంస్థ. ఇదొక కాంపాక్ట్ ఎస్యూవీ! తాజాగా.. ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో.. ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ను సంస్థకు చెందిన డీలర్షిప్ షోరూమ్స్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు.. 2023 అక్టోబర్ 15 నుంచి మొదలవుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్కి గట్టి పోటీ..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై ఫోకస్ చేసిన సిట్రోయెన్ సంస్థ.. ఇప్పటికే సీ3, ఈసీ3 వంటి మోడల్స్‌ను లాంచ్ చేసింది. తాజాగా.. సి3 ఎయిర్‌క్రాస్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ ఎస్‌యూవీలో ఉన్న 90శాతానికిపైగా ఫీచర్స్‌ను దేశీయంగానే రూపొందించినట్టు సంస్థ వెల్లడించింది. ఇక ఈ సీ3 ఎయిర్‌క్రాస్‌కు మార్కెట్లో గట్టిపోటీయే ఉంది. కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, వోక్స్వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజ్ హైరైడర్, హోండా ఎలివేట్ వంటి మోడల్స్ ఉన్న సెగ్మెంట్లోనే ఈ సిట్రోయెన్ వెహికిల్ సైతం లాంచ్ అవుతోంది.
"సిట్రోయెన్ సీ3 ఎయిక్రాస్ను ఈ ఏడాది ఏప్రిల్‌లో రివీల్ చేశాము. అప్పటి నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఇక ఇప్పుడు ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించాము. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను రూపొందించాము. ఇది ప్రజలను ఆకర్షిస్తుందని నమ్మకంగా ఉంది," అని సిట్రోయెన్ ఎండీ రోలాండ్ బౌచర వెల్లడించారు.
ఇదీ చూడండి:- Maruti Suzuki Dzire : కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో 50శాతం మార్కెట్ షేర్ ఉన్న కారు ఇదే!
ఇక ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎంలు, టీపీఎంఎస్, రేర్ వైపర్ విత్ వాషర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, 2-3 రోలకు రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్, రేర్ డీఫాగర్ వంటివి వస్తున్నాయి. 6 ఎయిర్బాగ్స్ దీని సొంతం.
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 2 సీటింగ్ (5సీటర్, 7 సీటర్) కాన్ఫిగరేషన్ ఉంది. ఇంజిన్ మాత్రం.. ఈ రెండింటికీ ఒకటే! ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 1008 హెచ్‌పీ పవర్‌ను, 190ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ మోడల్ ధర ఎంతంటే..
ఈ సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలుగా ఉంది. మోనోటోన్, డ్యూయెల్ టోన్ సహా మొత్తం 10 రంగుల్లో ఈ ఎస్యూవీ అందుబాటులో ఉండనుంది.
సంబంధిత కథనం