Maruti Suzuki Dzire : కాంపాక్ట్​ సెడాన్​ సెగ్మెంట్​లో 50శాతం మార్కెట్​ షేర్​ ఉన్న కారు ఇదే!-maruti suzuki dzire reaches 25 lakh units sales milestone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Dzire Reaches 25 Lakh Units Sales Milestone

Maruti Suzuki Dzire : కాంపాక్ట్​ సెడాన్​ సెగ్మెంట్​లో 50శాతం మార్కెట్​ షేర్​ ఉన్న కారు ఇదే!

Sharath Chitturi HT Telugu
Sep 15, 2023 12:50 PM IST

Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీకి చెందిన కాంపాక్ట్​ సెడాన్​ మోడల్ డిజైర్​.. సరికొత్త మైలురాయికి చేరుకుంది. ఇప్పటివరకు 25లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయి.

కాంపాక్ట్​ సెడాన్​ సెగ్మెంట్​లో 50శాతం మార్కెట్​ షేర్​ ఉన్న కారు ఇదే!
కాంపాక్ట్​ సెడాన్​ సెగ్మెంట్​లో 50శాతం మార్కెట్​ షేర్​ ఉన్న కారు ఇదే!

Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీ డిజైర్​.. మరో మైలురాయిని తాకింది! 15ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో.. ఈ మోడల్​కు చెందిన 25లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయి. ఫలితంగా.. ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని కాంపాక్ట్​ సెడాన్​ సెగ్మెంట్​లో మారుతీ సుజుకీ డిజైర్​ రారాజుగా కొనసాగుతోందని సంస్థ వెల్లడించింది. ఈ సెగ్మెంట్​లో 50శాతం మార్కెట్​ షేర్​ కలిగిన వాహనంగా డిజైర్​ ఎదిగిందని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

వాల్యూ ఫర్​ మనీ..!

కాంపాక్ట్​ సెడాన్​ సెగ్మెంట్​లో డిజైర్​ వెహికిల్​.. 25లక్షల మైలురాయిని చేరుకుంది. కానీ ఈ సెగ్మెంట్​లో ఇతర వాహనాలేవీ కనీసం 10లక్షల సేల్స్​ని కూడా చూడలేదని మారుతీ సుజుకీ వెల్లడించింది. టాటా టిగోర్​, హోండా అమేజ్​, హ్యుందాయ్​ ఔరా వంటి మోడల్స్​.. డిజైర్​కు పోటీగా మార్కెట్​లోకి అడుగుపెట్టాయి. కానీ ఇప్పటివరకు ఈ సెగ్మెంట్​లో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా డిజైర్​ మాత్రమే కొనసాగుతోంది.

Maruti Suzuki Dzire on road price Hyderabad : "మంచి క్వాలిటీ స్టాండర్డ్స్​, లేటెస్ట్​ టెక్నాలజీ, ఇన్నోవేటివ్​ ఫీచర్స్​, సరికొత్త డిజైన్​తో కూడిన వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేసేందుకు మారుతీ సుజుకీ కట్టుబడి ఉంది. డిజైర్​.. 25లక్షల మైలురాయిని చేరేందుకు దోహదపడిన వారందరికి మా కృతజ్ఞతలు," అని సంస్థకు చెందిన సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​, మార్కెటింగ్​- సేల్స్​, శశాంక్​ శ్రీవాస్తవ తెలిపారు.

ఇదీ చూడండి:- 2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఈ రెండు కార్స్​లో ఏది బెస్ట్​?

ఈ మారుతీ సుజుకీ డిజైర్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.53లక్షలు- రూ. 9.39లక్షల మధ్యలో ఉంటుంది. తక్కువ ధరకే మంచి ఫీచర్స్​ వస్తుండటంతో ప్రజల్లో ఈ మోడల్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇదొక వాల్యూ ఫర్​ మనీ మోడల్​గా గుర్తింపు సంపాదించుకుంది. మాగ్మా గ్రే, బ్లూయిష్​ బ్లాక్​, ఆక్స్​ఫర్డ్​ బ్లూ, ఆర్క్​టిక్​ వైట్​, ఫీనిక్స్​ రెడ్​, స్ప్లెండిడ్​ సిల్వ్​, షీర్​వుడ్​ బ్రౌన్​ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఎల్​ఈడీ ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ డైటైమ్​ రన్నింగ్​ లైట్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, బోల్డ్​ ఫ్రెంట్​ గ్రిల్​, డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​, స్మార్ట్​ప్లే స్టూడియో ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటో-ఫోల్డింగ్​ రేర్​వ్యూ మిర్రర్స్​ వంటివి లభిస్తున్నాయి.

Maruti Suzuki Dzire features : ఈ మారుతీ సుజుకీ డిజైర్​లో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. మేన్యువల్​, ఏఎంజీ వేరియంట్స్​ ఉంటాయి. సీఎన్​జీ మోడల్​ కూడా అందుబాటులో ఉంది. ఇవి మంచి మైలేజ్​ని కూడా ఇస్తాయి!

WhatsApp channel

సంబంధిత కథనం