Hyundai i20 facelift : హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు- వాటి ఫీచర్స్ ఇవే!
10 September 2023, 18:18 IST
- Hyundai i20 facelift : 2023 హ్యుందాయ్ ఐ20 బయటకు వచ్చింది. ఈ మోడల్ వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు- వాటి ఫీచర్స్ ఇవే!
Hyundai i20 facelift : 2023 హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను ఇటీవలే లాంచ్ చేసింది ఆటోమొబైల్ సంస్థ. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 6.99లక్షలు- రూ. 11.16లక్షల మధ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్లు, వాటి ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ ఐ20 ఎరా..
హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో ఎరా అనేది బేస్ మోడల్. ఇందులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ దీని సొంతం. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, హిల్- స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ కంట్రోల్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్, చైలడ్ సీట్ యాంకర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వస్తున్నాయి. హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, 14 ఇంచ్ స్టీల్ వీల్స్, బాడీ కలర్డ్ ఓఆర్వీఎంలు, ఫ్రెంట్ సీట్ అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్స్, ఇంజిన్ స్టార్ట్- స్టాప్ సిస్టెమ్, ఫ్రెంట్ పవర్ ఔట్లెట్, మ్యాప్ లాంప్స్ వంటివి సైతం లభిస్తున్నాయి.
హ్యుందాయ్ ఐ20 మాగ్నా..
ఎరా వేరియంట్లో ఉన్న ఇంజిన్నే ఇందులోనూ కొనసాగిస్తోం హ్యుందాయ్. మేన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. ఎరాలో కనిపిస్తున్న అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. అదనంగ.. ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, ఆటోమెటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 15 ఇంచ్ స్టీల్ వీల్స్, షార్క్‌ఫిన్ రూఫ్ యాంటీనా, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎంలు, ఫోల్డెబుల్ కీ వంటివి వస్తున్నాయి. ఫిక్స్డ్ ఆర్మరెస్ట్, వాయిస్ రికగ్నీషన్తో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా వస్తోంది. ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, రేర్ ఏసీ వెంట్స్ లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- 2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఈ రెండు కార్స్లో ఏది బెస్ట్?
హ్యుందయ్ ఐ20 స్పోర్ట్జ్..
2023 Hyundai i20 price in India : ఇందులో మేన్యువల్, ఐవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ష్ వంటివి ఉన్నాయి. మాగ్నా వేరియంట్లో వచ్చే ఫీచర్స్‌తో పాటు ఇందులో 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ స్టీల్ వీల్స్, వింగ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్ వస్తున్నాయి. రేర్ కెమెరా, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లే, క్రూజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటివి వస్తున్నాయి.
హ్యుందాయ్ ఐ20 ఆస్టా..
హ్యుందాయ్ ఐ20లో రెండో టాప్ ఎండ్ మోడల్ ఈ ఆస్టా. ఇందులో స్పోర్ట్జ్లోని వేరియంట్స్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్ కీ, 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్, బగ్లర్ అలారం, బ్లూ యాంబియెంట్ లైటింగ, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్- గేర్ షిప్టర్, సైడ్లింగ్ టైప్ ఫ్రెంట్ ఆర్మ్‌రెస్ట్, రేర్ వైపర్, వాషర్, లగ్గేజ్ ల్యాంప్, 7 స్పీకర్ బోస్ ప్రీమియం ఆడియో సిస్టెమ్, సబ్ ఊఫర్లు లభిస్తున్నాయి.
హ్యుందాయ్ ఐ20 ఆస్టా (ఓ)..
2023 Hyundai i20 variants : 2023 హ్యుందాయ్ ఐ20లో టాప్ ఎండ్ మోడల్. ఇందులో మేన్యువల్, ఐవీటీ గేర్‌బాక్స్ వస్తున్నాయి. ఆస్టా వేరియంట్లోని ఫీచర్స్‌తో పాటు ఇందులో.. వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్- అడ్జెస్టెబుల్ సీట్స్, రేర్ సీట్ అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్స్, హోమ్ టు కార్ విత్ అలెక్సా ఇంటిగ్రేషన్, యాంబియెంట్ సౌండ్స్, హ్యుందాయ్ బ్లూ లింక్, ఓవర్ ది టాప్ మ్యాప్ అప్డేట్స్, 10.25 ఇంచ్ హెచ్డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, నేవిగేషన్ సిస్టెమ్లు లభిస్తున్నాయి.