2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఈ రెండు కార్స్​లో ఏది బెస్ట్​?-2023 hyundai i20 vs maruti suzuki baleno check detailed comparison of prices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  2023 Hyundai I20 Vs Maruti Suzuki Baleno Check Detailed Comparison Of Prices

2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఈ రెండు కార్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Sep 10, 2023 10:30 AM IST

2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : 2023 హ్యుందాయ్​ ఐ20 వర్సెస్​ మారుతీ సుజుకీ బలెనో.. ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

ఈ రెండు కార్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు కార్స్​లో ఏది బెస్ట్​?

2023 Hyundai i20 vs Maruti Suzuki Baleno : ఇండియాలో హ్యుందాయ్​ సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్​గా ఉంది ఐ20. తాజాగా.. ఈ మోడల్​కు 2023 వర్షెన్​ను లాంచ్​ చేసింది సంస్థ. ఈ హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​.. మారుతీ సుజుకీ బలెనోతో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? అన్నది ఇక్కట తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఈ రెండు కార్స్​ లుక్స్​ ఎలా ఉన్నాయంటే..

హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​లో స్కల్ప్​టెడ్​ బానెట్​, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​తో కూడిన కొత్త స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​తో కూడిన రివైజ్​డ్​ బంపర్స్​, భారీ హెక్సాగొనల్​ బ్లాక్​ గ్రిల్​, జెడ్​- షేప్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, 16 ఇంచ్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వంటివి లభిస్తున్నాయి.

మారుతీ సుజుకీ బలెనోలో మస్క్యులర్​ హుడ్​, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​తో కూడిన ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, సరికొత్త క్రోమ్​ సరౌండెడ్​ గ్రిల్​, ఇండికటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

ఈ రెండు కార్స్​లో ఉన్న ఫీచర్స్​ ఇవే..

Hyundai i20 facelift : 2023 హ్యుందాయ్​ ఐ20 హ్యాచ్​బ్యాక్​ 5 సీటర్​ కేబిన్​లో సెమీ లెథరెట్​ సీట్స్​, వాయిస్​ కంట్రోల్డ్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, యాంబియెంట లైటింగ్​, వయర్​లెస్​ ఛార్జర్​, బాస్​ సౌండ్​ సిస్టెమ్​, 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- Tata Nexon EV vs Mahindra XUV400 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

ఇక మారుతీ సుజుకీ బలెనోలోని 5 సీటర్​ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ప్రీమియం ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, హెడ్​-అప్​ డిస్​ప్లే, ఆర్కెమిస్​ సౌండ్​ సిస్టెమ్​, 9.0 ఇంచ్​ స్మార్ట్​ప్లే ప్రో+ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి వస్తున్నాయి.

ఈ రెండు కార్లలోనూ 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉన్నాయి.

ఈ రెండు కార్స్​లో ఉన్న ఇంజిన్​..

హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​లో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​, ఇన్​లైన్​ 4 పెట్రోల్​ మోటార్​ ఉంటుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, ఐవీటీ ట్రాన్సిమిషన్​ ఆప్షన్న్​ ఉన్నాయి. మేన్యువల్​ వేరియంట్​లో ఈ ఇంజిన్​ 87 హెచ్​పీ పవర్​ను, 115 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

2023 Hyundai i20 on road price Hyderabad : మారుతీ సుజుకీ బలెనోలో 1.2 లీటర్​ డ్యూయెల్​ వీవీటీ, కే సిరీస్​, ఇన్​లైన్​ 4 పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 89 హెచ్​పీ పవర్​ను, 113 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​, 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

ఈ రెండు కార్స్​ ధరలెంత?

ఇండియాలో 2023 హ్యుందాయ్​ ఐ20 ఎక్స్​షోరూం ధర రూ. 6.99లక్షలు- రూ. 11.1లక్షల మధ్యలో ఉంటుంది. ఇక మారుతీ సుజుకీ బలెనో ఎక్స్​షోరూం ధర రూ. 6.61లక్షలు- రూ. 9.88లక్షల మధ్యలో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం