తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Range Rover Velar : 2023 రేంజ్​ రోవర్​ వేలర్​ లాంచ్​.. ధర రూ. 93లక్షలు

Range Rover Velar : 2023 రేంజ్​ రోవర్​ వేలర్​ లాంచ్​.. ధర రూ. 93లక్షలు

Sharath Chitturi HT Telugu

25 July 2023, 12:49 IST

google News
    • 2023 Range Rover Velar launch : రేంజ్​ రోవర్​ వేలర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ.93లక్షలు!
2023 రేంజ్​ రోవర్​ వేలర్​ లాంచ్​..
2023 రేంజ్​ రోవర్​ వేలర్​ లాంచ్​.. (HT AUTO)

2023 రేంజ్​ రోవర్​ వేలర్​ లాంచ్​..

2023 Range Rover Velar launch : ఇండియాలో 2023 రేంజ్​ రోవల్​ వేలర్​ను తాజాగా లాంచ్​ చేసింది జాగ్యువర్​ ల్యాండ్​ రోవర్​ సంస్థ. బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. సెప్టెంబర్​ నుంచి డెలివరీలు మొదలుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ హైలైట్స్​ ఇక్కడ తెలుసుకుందాము..

వేలర్​ ఎస్​యూవీ స్పెసిఫికేషన్స్​..

రేంజ్​ రోవల్​ వేలర్​కు ఇది ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. లుక్స్​, సస్పెన్షన్స్​ మెరుగుపడ్డాయి. పలు కొత్త ఫీచర్స్​ కూడా యాడ్​ అయ్యాయి. ఒకటే వేరియంట్​లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మోడల్​ లాంచ్​తో.. ఇండియాలో లగ్జరీ వాహనాల సెగ్మెంట్​లో పోటీ మరింత పెరిగిందని చెప్పుకోవాలి.

2023 Range Rover Velar price : ఇక ఈ కొత్త ఎస్​యూవీ బానెట్​పై 'రేంజ్​ రోవర్​' అని రాసి ఉంటుంది. వైడ్​ గ్రిల్​, పిక్సెల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, వైడ్​ ఎయిర్​ వెంట్​ వంటివి ఫ్రెంట్​లో వస్తున్నాయి. బ్లాక్​ పిల్లర్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ సైతం లభిస్తున్నాయి. ఇక రేర్​లో షార్క్​ ఫిన్​ యాంటీనా, రేక్​డ్​ విండ్​స్క్రీన్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​ల్యాంప్స్​, రీడిజైన్డ్​ బంపర్​ వంటివి వస్తున్నాయి.

ఇదీ చూడండి:- India's first self-driving car: భారతదేశ తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించిన బెంగళూరు స్టార్ట్ అప్ కంపెనీ

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే ఈ 2023 రేంజ్​ రోవర్​ వేలర్​లో కేబిన్​ లగ్జరీగా ఉంటుంది. ఎయిర్​ ప్యూరిఫయర్​, హీటెడ్​ సీట్స్​, రీ డిజైన్డ్​ డాష్​బోర్డ్​, ఆటో క్లైమేట్​ కంట్రోల్​, క్లీనర్​ సెంటర్​ కన్సోల్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​లు ఉన్నాయి. వయర్​లెస్​ ఛార్జర్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 11.4 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి కేబిన్​లో ఉన్నాయి.

ఇక సేఫ్టీ కోసం ఈ లగ్జరీ ఎస్​యూవీలో మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, టెర్రైన్​ రెస్పాన్స్​ వంటి ఫీచర్స్​ లభిస్తున్నాయి.

ఇంజిన్​.. ధర వివరాలివే..

Range Rover Velar facelift features : ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో 2.0 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 250 హెచ్​పీ పవర్​ను, 365 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 2.0 లీటర్​, మైల్డ్​ హైబ్రీడ్​ డీజిల్​ ఇంజిన్​.. 204 హెచ్​పీ పవర్​ను, 430 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్​ స్పీడ్​ను కేవలం 7.5 సెకన్స్​లో అందుకుంటుంది. దీని టాప్​ స్పీడ్ 217 కేఎంపీహెచ్​.

ఇక 2023 రేంజ్​ రోవర్​ వేలర్​ ఎక్స్​షోరూం ధర రూ. 93లక్షలు. పాత మోడల్​తో పోల్చుకుంటే ఇది రూ. 3.59లక్షలు ఎక్కువే!

Range Rover Velar 2023 : ఇది ఇలా ఉండగా.. ఒలంపిక్​ ఛాంపియన్​ నీరజ్​ చోప్రా.. రేంజ్​ రోవర్​ వేలర్​ పాత మోడల్​ను ఇటీవలే తన కలెక్షన్​లో యాడ్​ చేసుకున్నాడు. హరియాణాలోని ఓ షోరూమ్​ నుంచి ఈ ఎస్​యూవీని ఇంటికి నడిపాడు. ఆయన కలెక్షన్​లో ఇప్పటికే చాలా బైక్స్​, కార్స్​ ఉన్నాయి.

తదుపరి వ్యాసం