తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Range Rover Sport Sv : సరికొత్త టెక్నాలజీతో రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ.. వచ్చేస్తోంది!

Range Rover Sport SV : సరికొత్త టెక్నాలజీతో రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ.. వచ్చేస్తోంది!

Sharath Chitturi HT Telugu

24 April 2023, 6:23 IST

google News
    • Range Rover Sport SV : రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ త్వరలో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
సరికొత్త టెక్నాలజీతో రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ
సరికొత్త టెక్నాలజీతో రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ (Range rover)

సరికొత్త టెక్నాలజీతో రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ

Range Rover Sport SV : రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీని త్వరలోనే ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ జాగ్వర్​ ల్యాండ్​ రోవర్​. మే 31న అంతర్జాతీయంగా ఈ ఎస్​యూవీని రివీల్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. ఈ మోడల్​.. రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీఆర్​కి సక్సెసర్​. ఇదొక లిమిటెడ్​ ఎడిషన్​ ఎస్​యూవీ అని తెలుస్తోంది. అవరసమైతే, డిమాండ్​ని బట్టి ప్రొడక్షన్​ను పెంచాలని జేఎల్​ఆర్​ భావిస్తున్నట్టు సమాచారం. రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ మోడల్స్​లో ఇదే ది ఫాస్టెస్ట్​ అండ్​ అడ్వాన్స్​డ్​ మోడల్​ అని సంస్థ చెబుతోంది.

ఈ రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీకి సంబంధించిన టీజర్​ను సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్​ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్​లో వరల్డ్​ క్లాస్​, సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కొత్త ఫీచర్స్​ వస్తాయని, ఇవి ఈ ఎస్​యూవీ పర్ఫార్మెన్స్​ను మరింత మెరుగుపరుస్తాయని తెలుస్తోంది.

ఈ రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ- లుక్స్​..

Range Rover Sport SV launch : రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీలో మస్క్యులర్​ క్లామ్​షెల్​ హుడ్​, బ్లాక్​డ్​- ఔట్​ గ్రిల్​, స్వెప్ట్​ బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ విత్​ ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎం, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, ఫ్లేర్డ్ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ వీల్స్​ వస్తాయి. రేర్​లో.. డ్యూయెల్​ షార్క్​ ఫిన్​ యాంటీనా, వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​ వంటివి రానున్నాయి.

ఈ 2024 రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీలో 5 సీటర్​ కేబిన్​ స్పేషియస్​గా ఉంటుంది. వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీటస్​, మల్టీ కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, పానారోమిక్​ సన్​రూఫ్​, మల్టీ-జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, ఎయిర్​ ప్యూరిఫయర్​, లెథర్​ వ్రాప్డ్​ స్టీరింగ్​ వీల్​ విత్​ ప్యాడిల్​ షిఫ్టర్స్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఫ్లోటింగ్​ టైప్​ పివి- ప్రో ఇన్​ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ వచ్చే అవకాశం ఉంది.

Range Rover Sport SV price : ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​తో పాటు ఏడీఏఎస్​ ఫంక్షన్​ కూడా అందుబాటులోకి రానుంది.

ఈ రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ- ఇంజిన్​..

ఈ రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీలో బీఎండబ్ల్యూలో వినియోగించే 4.4 లీటర్​, ట్విన్​ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇది 614 హెచ్​పీ పవర్​ను, 750ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. మైల్డ్​- హైబ్రీడ్​ టెక్నాలజీ కూడా లభించే అవకాశం ఉంది.

ఈ రేంజ్​ రోవర్​ స్పోర్ట్​ ఎస్​వీ- ధర..

2024 Range Rover Sport SV :ఈ ఎస్​యూవీ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. మే 31 లాంచ్​ ఈవెంట్​లో ధరతో పాటు ఇతర వివరాలు తెలుస్తాయి. కాగా.. అమెరికాలో రేంజ్​ రోవర్​ ఎస్​వీఆర్​ ధర 141,600 డాలర్లుగా ఉంది. ఇండియన్​ కరెన్సీలో దాని విలువు దాదాపు రూ. 1.16కోట్లు. కొత్త మోడల్​ ధర దీని కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం