India's first self-driving car: భారతదేశ తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించిన బెంగళూరు స్టార్ట్ అప్ కంపెనీ
భారత్ లో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును టెస్లానో, లేక గూగుల్ నో ఆవిష్కరించలేదు. బెంగళూరుకు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపెనీ భారత్ లో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించింది. మైనస్ జీరో (Minus Zero) అనే పేరున్న ఆ స్టార్ట్ అప్ కంపెనీ జెడ్ పాడ్ (zPod) అనే పేరుతో ఈ కారును రూపొందించింది.
India's first self-driving car: భారత్ లో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును టెస్లానో, లేక గూగుల్ నో ఆవిష్కరించలేదు. బెంగళూరుకు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపెనీ భారత్ లో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించింది. మైనస్ జీరో (Minus Zero) అనే పేరున్న ఆ స్టార్ట్ అప్ కంపెనీ జెడ్ పాడ్ (zPod) అనే పేరుతో ఈ కారును రూపొందించింది.
భారత్ లో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారు
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతీయ రహదారులపై పరుగులు తీయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా, గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లను రూపొందించే దిశగా చేపట్టిన ప్రయోగాలు దాదాపు చివరి దశకు వచ్చాయి. ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే, ఈ లోపే భారత్ లో మైనస్ జీరో (Minus Zero) అనే స్టార్ట్ అప్ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించింది. ఆ కారుకు జెడ్ పాడ్ (zPod) అనే పేరు పెట్టింది. బెంగళూరు రోడ్లపై టోస్టర్ షేప్ లో ఉన్న ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారును పరీక్షించింది. అన్ని ట్రాఫిక్ కండిషన్లలో, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ కారు పని చేస్తుందని మైనస్ జీరో కంపెనీ ధీమాగా చెబుతోంది.
స్టీరింగ్ వీల్ లేకుండానే..
స్టీరింగ్ వీల్ లేకపోవడం ఈ కారు ప్రత్యేకత. అందుకు బదులుగా 360 డిగ్రీల్లో అమర్చిన హై రెజొల్యూషన్ కెమెరాలను ఈ కారుకు అమర్చారు. ఆ కెమెరాల సాయంతో కారులో ఉన్న కృత్రిమ మేథ (artificial intelligence AI) ట్రాఫిక్ ను, రోడ్డును విశ్లేషిస్తూ, అడ్డంకులను అధిగమిస్తూ కారును ముందుకు తీసుకువెళ్తుంది. ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కారు సాధించే అత్యధిక అటానమీ అయిన లెవెల్ 5 ను ఈ జెడ్ పాడ్ (zPod) సాధించిందని కంపెనీ వివరిస్తోంది. అంటే, లెవెల్ 5 అటానమీ సాధించిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎలాంటి మానవ సహాయం అవసరం లేకుండానే ముందుకు వెళ్తుంది. మిగతా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు, ఈ జెడ్ పాడ్ (zPod) కు మధ్య తేడా ఏంటంటే.. గూగుల్ వేమో (Google's Waymo) వంటి వేరే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఖరీదైన సెన్సర్లను ఉపయోగిస్తే, ఈ జెడ్ పాడ్ (zPod) లో చవకైన కెమెరాలను ఉపయోగించారు.