తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  జగన్ బటన్ నొక్కితే మా గ్రాఫ్ పడిపోతోంది.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

జగన్ బటన్ నొక్కితే మా గ్రాఫ్ పడిపోతోంది.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

29 June 2022, 20:53 IST

    • ycp mla maddisetti venugopal: ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బాలినేని, కోటంరెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కీలక కామెంట్స్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి షాకింగ్ కామెంట్స్
వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి షాకింగ్ కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి షాకింగ్ కామెంట్స్

ycp mla maddisetti venugopal sensational comments: ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుంది తప్ప ఎమ్మెల్యేలది కాదన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వేయాలన్న ఆయన.. వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలని కామెంట్స్ చేశారు. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశానని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలో పనులన్నీ వైసీపీ కార్యకర్తలకే అప్పగించానని.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో వారంతా అప్పులపాలయ్యారని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆదుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఎమ్మెల్యే మద్దిశెట్టి తెలిపారు. ప్రభుత్వం నుంచి కార్యకర్తలకు రావాల్సిన పేరుకుపోయిన బిల్లులు మంజూరు చేయాలని కోరారు. కార్యకర్తల్లో బయటకి కనిపిస్తున్న ఆనందం.. వారి జీవితాల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు గడపగడపకు వెళ్తే ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే పార్టీలోని పరిణామాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో కొందరు ముఖ్యనేతలు తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పక్క నియోజకవర్గానికి చెందిన వారు తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని.. వారు వెనక్కి తగ్గితే మంచిదని లేదంటే బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అంతేకాదు తన నియోజకవర్గంపై చూపే శ్రద్ధ మీ సొంత నియోజకవర్గాలపై చూపుకోవాలని హితవుపలికారు. ఇక ప్రకాశం జిల్లాకే చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా.. పార్టీలో తనపై కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేశారు. వైసీపీలో ఎమ్మెల్యేలు తరచూ ఇలాంటి కామెంట్స్ చేయడంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

టాపిక్