తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Telugu Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telugu Weather alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

HT Telugu Desk HT Telugu

07 September 2022, 11:24 IST

google News
    • Rains in Andhrapradesh: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

Rains to continue in Andhra Pradesh for two days: దక్షిణ, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇటు ద్రోణి, అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

తెలంగాణలో ఇలా...

Rains in Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

2 దశాబ్దాల తర్వాత...

Heavy Rains in Andhra: కృష్ణా, పెన్నార్ బేసిన్‌లలోని ఎగువ ప్రాంతాలతో పాటు ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లకు భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు రెండు దశాబ్దాల తర్వాత పొంగిపొర్లుతున్నాయని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు(Srisailam Project), నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

తదుపరి వ్యాసం