Rains In Telangana : ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
IMD Rain Alert : తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరో రెండు మూడు రోజులు.. గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాని వెల్లడించింది.
భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం రోజున ఆదిలాబాద్, కొమురం భీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉంది.
గురువారం రోజున.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం, మచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మాల్కాజిగిరి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
తాజాగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వాన కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
సంబంధిత కథనం