IMD rains alert: 5 రోజులపాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు-imd alert cyclonic circulation on wednesday very heavy rains in these states including andhra pradesh telanagana ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Rains Alert: 5 రోజులపాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు

IMD rains alert: 5 రోజులపాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 03:05 PM IST

IMD rains alert: రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు
రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు (AFP)

IMD rains alert: ఎల్లుండికల్లా తూర్పు - మధ్య బంగాళాఖాతం మీదుగా తుపాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలియజేసింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల పాటు ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణ భారత ద్వీకల్ప ప్రాంతంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు కోస్తా తీరం, మహారాష్ట్ర, గుజరాత్‌‌లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించింది.

వర్షాలు ఏ రోజులో ఎక్కడ పడతాయి?

  • సెప్టెంబరు 5, 8, 9 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి. సెప్టెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక తెలంగాణ, కర్ణాటకలోని కోస్తా, దక్షిణ ప్రాంతాలు, కేరళ, మాహే ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇక సెప్టెంబరు 6 నుంచి 9వ తేదీ వరకు రాయలసీమలో వర్షాలు కురుస్తాయి.
  • కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో సెప్టెంబరు 9న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 5వ తేదీన లక్షద్వీప్, 6, 7 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, 6 నుంచి 8 వరకు దక్షిణ కర్ణాటక, 7, 8 తేదీల్లో కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది.
  • సెప్టెంబరు 5న పశ్చిమ మధ్య ప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయి. సెప్టెంబరు 5, 9 తేదీల్లో తూర్పు మధ్య ప్రదేశ్‌లో, ఆరో తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒడిశాల్లో, 5, 8, 9 తేదీల్లో మరఠ్వాడలో వర్షాలు కురుస్తాయి.
  • సెప్టెంబరు 5 నుంచి 8 వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.

IPL_Entry_Point