Monsoon Tips : వాతావరణం చల్లగా ఉందని స్నానం చేయడం మానేస్తున్నారా? అయితే జాగ్రత్త
Bath Skipping Issues : చాలా మంది వర్షాకాలంలో స్నానం చేసేందుకు బద్ధకిస్తూ ఉంటారు. ఆ వాతావరణం కూడా అలాగే ఉంటుంది. కానీ ఏది ఏమైనా స్నానం చేయాలి అంటున్నారు చర్మ వ్యాధినిపుణులు. లేదంటే చర్మ సంబంధ వ్యాధులు, సీజనల్ వ్యాధులు త్వరగా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
Bath Skipping Issues : చలికాలం, వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. పైగా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఈ సమయంలో మనం ఏపని చేయడానికైనా కాస్త బద్ధకిస్తాము. ముఖ్యంగా స్నానం చేయాలని అనిపించదు. కానీ ఇలా చేయకపోవడం వల్ల అనేక హానికరమై ప్రభావాలు మనపై వస్తాయి అంటున్నారు నిపుణులు. శీతాకాలం కన్నా.. వర్షాకాలంలో స్నానం చేయకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయి అంటున్నారు. అయితే మీరు కూడా ఆ కోవకు చెందిన వారు అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే. స్నానం చేస్తే సరిపోయేదానికి.. సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి.
ఇన్ఫెక్షన్స్
వర్షాకాలంలో స్నానం చేయడం ఆపేస్తే మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో. ఈ మృతకణాలు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు మరింత వ్యాప్తి చెందుతాయి. స్నానం మానేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో మృతకణాలు బాగా పేరుకుపోయి.. మరిన్ని ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.
చెడు వాసన
బాత్ స్కిప్పింగ్ చేయడం వల్ల బాక్టీరియా శరీరం అంతటా వ్యాప్తి చెంది.. చెడు వాసనను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసహ్యకరమైన వాసనతో పాటు.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది
మనం స్నానానికి దూరంగా ఉన్నప్పుడు.. శరీరంలో ఉండే వైరస్, బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి.
హెయిర్ లాస్
వర్షాకాలంలో హెయిర్ లాస్ ఎక్కువగానే ఉంటుంది. పైగా మీరు బయట వర్షంలో తడిచి.. ఇంటికి వచ్చి తలస్నానం చేయకుంటే.. ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. పైగా స్కాల్ప్‌పై దురద వంటి సమస్యలు వస్తాయి. ఇవి హెయిర్ లాస్‌ను మరింత ప్రేరేపిస్తాయి.
స్కిన్ ప్రాబ్లమ్స్
స్నానం చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. స్నానం మానేస్తే.. చర్మవ్యాధులు, సీజనల్ వ్యాధులు మీకు త్వరగా వస్తాయి. ఒక్కోసారి ఇది తీవ్రమైన చర్మ వ్యాధులకు దారి తీస్తుంది.