తెలుగు న్యూస్ / తెలంగాణ /
Accident: ఘట్కేసర్ - వరంగల్ రహదారిపై రోడ్డు ప్రమాదం… ముగ్గురు దుర్మరణం
మేడ్చల్ జిల్లా అవుషాపూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
మేడ్చల్ జిల్లా అవుషాపూర్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Aushapur Road Accident: ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద ఉన్న వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.