Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటి విడుదల-srisailam dam gates opened ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Srisailam Dam Gates Opened

Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటి విడుదల

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 10:33 PM IST

ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కృష్ణ నదికి ఎగువన నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా నీరు చేరుతోంది. దీంతో అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 2.43 లక్షల క్యూసెక్కుల వరదనీరు రావడంతో జలాశయం 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు.

ట్రెండింగ్ వార్తలు

స్పిల్ వే ద్వారా లక్షా 96వేల 203 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత 884.90 అడుగులుగా నీటిమట్టం ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జునసాగర్​కు 63,068 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

WhatsApp channel