తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు

HT Telugu Desk HT Telugu

15 September 2022, 7:59 IST

google News
    • Weather News : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వానలు పడనున్నాయి. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి, కృష్ణా నదికి వరదలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీ తెలంగాణలో వర్షాలు
ఏపీ తెలంగాణలో వర్షాలు

ఏపీ తెలంగాణలో వర్షాలు

IMD Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన కారణంగా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం పడింది. వాయుగుండం ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుందని ఐఎండీ పేర్కొంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా ఏపీ, యానాంలలో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరిలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయి. రాయలసీమలో మరో రెండు రోజులు వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడని జల్లులు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు అక్కడక్కడా వానలు పడనున్నాయి. అయితే కొన్ని రోజులుగా చూసుకుంటే.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇవాళ హైదరాబాద్ లోనూ ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉంది. నగరంలో కొన్ని చోట్ల జల్లులు పడనున్నాయి. సెప్టెంబర్ 18న తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తదుపరి వ్యాసం