తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Wife Killed Husband : ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య…..

Wife Killed Husband : ప్రియుడి మోజులో భర్త దారుణ హత్య…..

HT Telugu Desk HT Telugu

13 January 2023, 9:53 IST

    • Wife Killed Husband ప్రియుడి మోజులో  భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య…. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  భార్య వలకాన్ని అనుమానించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగు చూసింది. శవాన్ని ఆనవాళ్లు కూడా లేకుండా కాల్చి బూడిద చేసేశారని తెలిసి షాక్ అయ్యారు. ఈ దారుణం విశాఖపట్నంలో జరిగింది. 
భర్తను హత్య చేసిన భార్య
భర్తను హత్య చేసిన భార్య

భర్తను హత్య చేసిన భార్య

Wife Killed Husband ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఇల్లాలు.. భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త ఇంటి నుంచి అదృశ్యమయ్యాడంటూ అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించి చివరకు దొరికిపోయింది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి సమీపంలో ఉన్న వాసవాని పాలేనికి చెందిన జ్యోతికి, భీమిలి మండలం వలందపేటకు చెందిన వంకా పైడిరాజుతో ఆరేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి బాలాజీ , హర్షిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

పైడిరాజు టైల్స్‌ పనులు చేస్తుంటాడు. నిందితురాలు జ్యోతికి పెళ్లికి ముందే వాసవానిపాలెంలో పొరుగింట్లో ఉండే వాడమొదులు నూకరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కుటుంబం సభ్యులు ఆమెకు పైడిరాజుతో పెళ్లి చేశారు. ఇటీవల నూకరాజు మళ్లీ జ్యోతితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. జ్యోతి అత్తింట్లో ఉమ్మడి కుటుంబం కావడంతో తరచూ కలుసుకోవడం కుదరదని వారిద్దరూ విశాలాక్షినగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నారు.

విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయంలో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తున్నానంటూ ఇంట్లోవాళ్లను నమ్మించి ఆరు నెలలుగా ప్రతిరోజూ ప్రియుడి గదికి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చేది. ప్రియుడిపై మోజుతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని జ్యోతి పథకం పన్నింది.

అన్నంలో నిద్ర మాత్రలు కలిపి భోజనం పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీ రాత్రి పైడిరాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. రాత్రి ఒంటిగంట సమయంలో ప్రియుడు నూకరాజుకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించింది. నూకరాజు తనకు సోదరుడి వరసయ్యే భూలోకతో కలిసి జ్యోతి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న పైడిరాజు మెడకు తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై మధ్యలో పెట్టుకుని విశాలాక్షినగర్‌లోని వారు ఉంటున్న గదికి తరలించారు.

అదే రోజు తెల్లవారుజామున నూకరాజు అంబులెన్స్‌కు కాల్‌ చేసి తన స్నేహితునికి ఒంట్లో బాగోలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. సిబ్బంది వచ్చి చూసి పైడిరాజు చనిపోయాడని చెప్పడంతో తమకు ఎవరూ లేరని నమ్మించి అదే వాహనంలో మృత దేహాన్ని పెద జాలారిపేట సమీపంలో ఉన్న వాసవానిపాలెం శ్మశానవాటికకు తరలించారు. అక్కడ శవాన్ని గుట్టుగా దహనం చేసి, బూడిదను సముద్రంలో కలిపేసి ఇంటికి వచ్చేశాడు.

హత్య జరిగిన తర్వాత డిసెంబర్ 30వ తేదీన జ్యోతి తన భర్త కనిపించడంలేదంటూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి సోదరులు జ్యోతి ప్రవర్తనపై అనుమానం వ్యక్తంచేయడం, ఆమె సీబీఐ కార్యాలయంలో పనిచేయడం లేదని తేలడంతో పోలీసులకు ఆమెపై అనుమానం బలపడింది. ఫోన్‌ కాల్ డేటాను బయటకు తీయడంతో నూకరాజుతో అక్రమ సంబంధం వెలుగు చూసింది.

నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో పైడిరాజును హత్య చేసినట్లు అంగీకరించారు. భర్తను దారుణంగా హత్య చేయించిన జ్యోతి ఘాతుకం తెలియడంతో వలందపేటకు చెందిన గ్రామస్థులు భారీ సంఖ్యలో భీమిలి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

టాపిక్