తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Murder : బస్టాండ్‌లో పరిచయం.. విశాఖ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు

Vizag Murder : బస్టాండ్‌లో పరిచయం.. విశాఖ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు

HT Telugu Desk HT Telugu

06 December 2022, 23:32 IST

    • Vizag Plastic Drum Murder Case : విశాఖలో ప్లాస్టిక్ డ్రమ్ లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. ఈ కేసును పోలీసుల చేధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. షాకింగ్ విషయాలు బయటపెట్టారు పోలీసులు.
వైజాగ్ క్రైమ్ న్యూస్
వైజాగ్ క్రైమ్ న్యూస్

వైజాగ్ క్రైమ్ న్యూస్

విశాఖపట్నం(Visakhapatnam) మధురవాడలో మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో డ్రమ్ములో దొరికిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు చేధించారు. రిషి అనే వ్యక్తి మహిళను హత్య చేశాడు. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మిగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో పలు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కేవలం ఒక్కసారి కలిసిన పరిచయం హత్య వరకూ దారి తీసింది.

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

సంవత్సరం కిందట శ్రీకాకుళం బస్ స్టాప్ లో రిషి, ధనలక్ష్మి నడుమ పరిచయం అయింది. తన భార్య(Wife) ఇంటికి వెళ్లిన సమయంలో ధనలక్ష్మిని రిషి ఇంటికి తీసుకొచ్చాడు. మధురవాడలో ఉంటున్న అద్దె ఇంట్లో ఆమెతో శారీరకంగా కలిశాడు. తమ మధ్య జరిగిన విషయాన్ని ధనలక్ష్మి ఆసరాగా తీసుకుంది. రిషిని డబ్బులు(Money) డిమాండ్ చేయడం మెుదలుపెట్టింది. దీంతో వాగ్వాదం మెుదలైంది. చుట్టుపక్కల వాళ్లకి విషయం తెలుస్తుందని భయపడ్డాడు రిషి. ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించి చంపేశాడు. మెుదట మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టాడు. కానీ ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో ప్లాస్టిక్ డ్రమ్ములోకి మార్చాడు.

మరోవైపు ఇంటి యజమాని రమేశ్ నెల అద్దె(Rent) గురించి అడుగుతూ ఉండేవాడు. భార్య డెలివరీకి వెళ్లిందని.. వచ్చాక అద్దె చెల్లిస్తామని చెబుతూ వచ్చేవాడు రిషి. ఇలా ఏడాది వరకు గడిపాడు. ఇక వాళ్లు రాకపోవడం, అద్దె చెల్లించకపోవడంతో సామన్లు బయటపడేసేందుకు ఓనర్ డిసైడ్ అయ్యాడు. వెళ్లి చూసేసరికి షాక్ అయ్యాడు. మహిళ మృతదేహం ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో హత్య విషయం బయటకు వచ్చింది.

ధనలక్ష్మి శవాన్ని బయటకు తరలించేందుకు చూసినా కుదరలేదు. దీంతో డ్రమ్ములో పెట్టాడు. అయితే ఇన్నిరోజులు డ్రమ్ములో పెట్టినా.. వాసన రాకపోడవంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుర్వాసన రాకుండా ఏదైనా ఉపయోగించడా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా రిషి అద్దె ఇంట్లో ఉండట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకోవడంతోపాటుగా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహం(Dead Body) పూర్తిగా కుళ్లిపోయేసరికి.. గుర్తుపట్టడం కష్టమైంది. ధనలక్మి శ్రీకాకుళం(Srikakulam) నుంచి వచ్చి.. చాలా రోజులైంది. అయినా ఆమె గురించి ఎవరూ రాలేదని పోలీసులు తెలిపారు.

మరోవైపు డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో.. దిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలోనే.. విశాఖలో హత్య జరిగిందని పుకార్లు జరిగాయి. కానీ అది వాస్తవం కాదని సీపీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. బస్ స్టాప్(Bus Stop)లో జరిగిన పరిచయంతో మహిళను రూమ్ కు తెచ్చుకుని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హత్య చేశాడని చెప్పారు. విశాఖ, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం(Srikakulam) జిల్లాల్లో బృందాలుగా విడిపోయి గాలించి.. రిషిని అరెస్టు చేశారు పోలీసులు.