తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled : నేడు, రేపు పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు....

Trains Cancelled : నేడు, రేపు పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు....

HT Telugu Desk HT Telugu

09 February 2023, 18:35 IST

    • Trains Cancelled ట్రాక్‌ మరమ్మతుల కారణంగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా మళ్లించారు.
విజయవాడ, గుంటూరు మధ్య ప్యాసింజర్ రైళ్ల రద్దు
విజయవాడ, గుంటూరు మధ్య ప్యాసింజర్ రైళ్ల రద్దు (ht)

విజయవాడ, గుంటూరు మధ్య ప్యాసింజర్ రైళ్ల రద్దు

Trains Cancelled రైల్వే ట్రాక్షన్ మరమ్మతుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్‌లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

ట్రైన్ నంబర్ 07978 విజయవాడ బిట్రగుంట ప్యాసింజర్‌ రైలు 9,10 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07500 విజయవాడ - గూడూరు ప్యాసింజర్ రైలు 9, 10 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07458 గూడూరు - విజయవాడ ప్యాసింజర్ రైలు 10, 11 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17267 కాకినాడ పోర్ట్‌- విశాఖపట్నం ప్యాసింజర్ రైలును 10వ తేదీన రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 07461 విజయవాడ -ఒంగోలు ప్యాసింజర్ రైలును పదో తేదీన రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07576 ఒంగోలు - విజయవాడ ప్యాసింజర్ రైలును 9,10 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17237 బిట్రగుంట - చెన్నై ప్యాసింజర్ రైలు పదో తేదీన రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17238 చెన్నై సెంట్రల్ - బిట్రగుంట ప్యాసింజర్ రైలును 10వ తేదీన రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 07783 విజయవాడ- గుంటూరు, ట్రైన్ నంబర్ 07779 గుంటూరు - మాచర్ల ప్యాసింజర్ రైళ్లను పదో తేదీన రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07580 మాచర్ల - నడికుడి ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07579 నడికుడి - మాచర్ల రైలును 9, 10 తేదీలలో రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 07780 మాచర్ల - గుంటూరు, ట్రైన్ నంబర్ 07788 గుంటూరు - విజయవాడ ప్యాసింజర్ రైలును 9, 10 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07791 కాచిగూడ - నడికూడి రైలును 10వ తేదీన రద్దు చేశారు. ట్రైన్్ నంబర్ 07792 నడికుడి - కాచిగూడ రైలును 9,10తేదీలలో రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 17258 కాకినాడ పోర్ట్ - విజయవాడ రైలును పదో తేదీన కాకినాడ-రాజమండ్రి మధ్య రద్దు చేశారు. 17257 విజయవాడ - కాకినాడ పోర్ట్ రైలను రాజమండ్రి - కాకినాడ పోర్ట్ మధ‌్య పాక్షికంగా రద్దు చేశారు.

టాపిక్