తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Tickets 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్లు విడుదల, ముఖ్య తేదీలివే

Tirumala Tickets 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్లు విడుదల, ముఖ్య తేదీలివే

18 February 2024, 10:39 IST

google News
    • Tirumala Tirupati Devasthanam News: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.మే నెల సేవా టికెట్లు, గదుల కోటా వివరాలను ప్రకటించింది. ఈ మేరకు ఆయా తేదీలను పేర్కొంది.
తిరుమల టికెట్లు
తిరుమల టికెట్లు

తిరుమల టికెట్లు

Tirumala Tickets 2024 : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

ఫిబ్రవరి 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

మే నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల

ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.

లీజుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌రియు క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల‌లోని వివిధ‌ ప్రాంతాల్లో ఉన్న 18 టీటీడీ క‌ల్యాణ మండపాలను 5 సంవ‌త్స‌రాల పాటు లైసెన్సు ప్రాతిప‌దిక‌న నిర్వ‌హించేందుకు టీటీడీ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఆస‌క్తి ఉన్నవారు ముందుకు రావాల‌ని కోరింది. ఆసక్తి ఉన్న హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు ఇతర వివరాలకు www.tirumala.org, www.tirupatibalaji.ap.gov.in లేదా www.tender.apeprocurement.gov.in వెబ్‌సైట్ల‌ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.

తదుపరి వ్యాసం