TTD Lecturer Posts : టీటీడీ కాలేజీల్లో 78 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఆన్ లైన్ అప్లికేషన్లు ఎప్పుడంటే?
TTD Colleges Lecturer Posts : టీటీడీ అనుబంధ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో 78 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్ లైన్ దరఖాస్తులకు ఆహ్వానించారు.
TTD Colleges Lecturer Posts : ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. టీటీడీ దేవస్థానాల డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదినక లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తిరుపతిలోని టీటీడీ డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీలు, జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీకి చెందిన అభ్యర్థులు...సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని నోటిఫికేషన్ లో తెలిపారు. హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు. అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు వివరాలు
కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీటీడీ అనుబంధ డిగ్రీ కాలేజీల్లో 49 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 29 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.370 కాగా, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షా విధానం
రాత పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్-1 లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీని 150 మార్కులకు, పేపర్-2 సంబంధిత సబ్జెక్టులో 150 ప్రశ్నలు 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370 వరకు, జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760 వరకు జీతాభత్యాలు ఇస్తారు.
డీఎల్ పోస్టులు
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
- ఉద్యోగాలు - డిగ్రీ లెక్చరర్
- మొత్తం ఖాళీలు - 240
- సబ్జెక్టులు - 11(వృక్షశాస్త్రం, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకామనిక్స్, హిస్టరీ, మ్యాథ్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, జువాలజీ).
- అర్హత - సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. సెట్, నెట్ వంటి అర్హత పరీక్షలు పాస్ కావాలి. ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
- దరఖాస్తులు - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 24, జనవరి 2024.
- ఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - 13, ఫిబ్రవరి 2024.
- ఎగ్జామ్ తేదీ - ఏప్రిల్/ మే, 2024.