Ratha Sapthami in Tirumala 2024: ఈనెల 16న ప్రత్యేక దర్శనాలు రద్దు - రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు-ttd has made extensive arrangements for ratha sapthami on february 16 at tirumala 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ratha Sapthami In Tirumala 2024: ఈనెల 16న ప్రత్యేక దర్శనాలు రద్దు - రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Ratha Sapthami in Tirumala 2024: ఈనెల 16న ప్రత్యేక దర్శనాలు రద్దు - రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 14, 2024 03:14 PM IST

Ratha Sapthami at Tirumala 2024: రథసప్తమికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా షెడ్లను కూడా సిద్ధం చేస్తోంది.

తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాటు
తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాటు (TTD)

Ratha Sapthami at Tirumala 2024: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో దీనిని అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని, ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వమ‌ని కూడా పిలుస్తారు. భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా అఖిలాండం వ‌ద్ద‌, మాడ వీధుల్లో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా సాంబార‌న్న‌, పెరుగ‌న్నం, పులిహోర‌, పొంగ‌ళి త‌దిత‌ర అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక దర్శనాలు రద్దు

ఫిబ్ర‌వ‌రి 16న ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్ర‌వ‌రి 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ ఉండ‌దు. భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. కాగా, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం భ‌క్తులు నిర్దేశించిన టైంస్లాట్ల‌ను పాటించ‌ని ప‌క్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది. ఫిబ్ర‌వ‌రి 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు గ‌దుల‌ కేటాయింపు కోసం సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబిసి, టిబి కౌంటర్ల‌ను మూసివేస్తారు. కౌంట‌ర్ల‌లో 4 లక్షలతో పాటు అద‌నంగా మ‌రో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లు:

వాహనసేవల వివరాలు :

తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం

ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం