తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Diaries And Calenders Available For Online Purchase

TTD Diaries : భ‌క్తుల‌కు అందుబాటులో 2023 టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్లు

HT Telugu Desk HT Telugu

27 November 2022, 13:59 IST

    • TTD Diaries తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన డైరీలను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చని టీటీడీ ప్రకటించింది. భక్తులకు తగినన్ని డైరీలు అందుబాటులో ఉన్నాయని కావాల్సిన వారు వాటిని కొనుగోలు చేయొచ్చని టీటీడీ ప్రకటించింది. 
భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు (twitter)

భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

TTD Diaries టీటీడీ నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. కావాల్సిన వారు వాటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని, డిడి తీసి పంపినా వాటిని పోస్టులో భక్తులకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని గోవింద రాజ స్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Pensions Distribution : ఇంటింటికీ పెన్షన్లు లేదా నేరుగా ఖాతాల్లో, పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు, ఇవాళ 56 మండలాల్లో తీవ్ర వడగాలులు

IRCTC Thailand Tour : 6 రోజుల థాయ్లాండ్ ట్రిప్ - ఐల్యాండ్ లో స్పీడ్ బోట్ జర్నీ, మరెన్నో టూరిజం స్పాట్స్! ఇదిగో ప్యాకేజీ

AP Polycet 2024: రేపే ఏపీ పాలీసెట్‌ 2024, పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎంట్రన్స్‌ ఫీజు చెల్లించే ఏర్పాటు..

విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయి లోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టిటిడి కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.

టీటీడీ క్యాలెండర్లు, డైరీల ధరలు….

12 పేజీల క్యాలెండర్ రూ.130/-,

డీలక్స్ డైరీ రూ.150/-,

చిన్న డైరీ రూ.120/-,

టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-,

శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-,

శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-,

శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-,

తెలుగు పంచాంగం క్యాలెండర్ - రూ.30/-గా నిర్ణయించారు. వీటిని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.

టిటిడి క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకునే వీలు కల్పించారు. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ''పబ్లికేషన్స్‌''ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. టిటిడి క్యాలెండర్లు, డైరీలు త‌పాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉత్సాహంగా బుక్‌ చేసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

భక్తులు డిడి తీసి పంపినా టిటిడి క్యాలెండర్‌, డైరీలను పొందవచ్చు. ఇందుకోసం ''కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి'' పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ''ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి'' అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ప్రయివేటు ట్రాన్సుపోర్టు ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

క్యాలెండర్‌, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 9963955585, 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.

టాపిక్