తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Govt Jobs 2024 : ఏపీ 'నిట్'లో 125 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

Govt Jobs 2024 : ఏపీ 'నిట్'లో 125 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

10 October 2024, 8:07 IST

google News
    • NIT Andhrapradesh Recruitment 2024 : ఏపీలోని నిట్(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 125 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(అక్టోబరు 10) పూర్తి కానుంది.
నిట్ ఏపీలో ఉద్యోగాలు 2024
నిట్ ఏపీలో ఉద్యోగాలు 2024

నిట్ ఏపీలో ఉద్యోగాలు 2024

ఇటీవలే ఏపీ తాడేపల్లిగూడెంలో ఉన్న నిట్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా 125 టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. ఈ పోస్టులకు గత నెల 19 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ గడువు ఇవాళ్టితో(అక్టోబర్ 10) పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు… https://www.nitandhra.ac.in/main/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మొత్తం 125 పోస్టులు…

ఈ 125 పోస్టులను కాంట్రాక్ట్ బేస్ లో రిక్రూట్ చేస్తారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఉద్యోగాలు 48 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఉద్యోగాలు 20 ఉండగా,. అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు 30 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

షార్ట్ లిస్ట్.. ఆపై ఇంటర్వూ..!

మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి జీతాలను నిర్ణయించారు. అభ్యర్థులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు వేర్వురుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వూ ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తే… ఆన్ లైన్ ప్రజేంటేనషన్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తామని నోటిఫికేషన్ లో వివరించారు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తారు. మెయిల్, ఆఫ్ లైన్ ద్వారా స్వీకరించమని అధికారులు స్పష్టం చేశారు.

నిట్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తాడేపల్లి గూడెం, ఆంధ్రప్రదేశ్
  • ఉద్యోగాల పేరు - టీచింగ్ పోస్టులు
  • మొత్తం ఖాళీలు - 125
  • ఖాళీల వివరాలు : అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఉద్యోగాలు 48, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II - 20, అసోసియేట్ ప్రొఫెసర్ 30 ఖాళీలు ఉన్నాయి.
  • దరఖాస్తులకు తుది గడువు- 10 అక్టోబర్ , 2024
  • అధికారిక వెబ్ సైట్ - https://www.nitandhra.ac.in/main/index.php 
  • అప్లికేషన్ డైరెక్ట్ లింక్ - https://nitandhra.ac.in/FRP/ 

మరోవైపు మంగ‌ళ‌గిరి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్‌)లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అక్టోబ‌ర్ 28 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రూప్ ఎ, డి, సి విభాగాల్లో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోస్టుల‌కు హార్డ్ కాపీలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు అక్టోబ‌ర్ 8 నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబ‌ర్‌ 28తో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు ముగిస్తాయి. 

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. గ్రూప్-ఏ పోస్టుల‌కు సంబంధించి కేవ‌లం ఇంట‌ర్యూలు ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే గ్రూప్ బీ, సీ పోస్టుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

తదుపరి వ్యాసం