Nandyal Jobs : నంద్యాల మహిళా, శిశు సంక్షేమ శాఖలో 14 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్- అక్టోబర్ 11 ఆఖరు తేదీ
Nandyal Jobs : నంద్యాల పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ కార్యాలయంలో 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 11 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.
నంద్యాల పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ కార్యాలయంలో కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తులు దాఖలు చేసేందుకు అక్టోబర్ 11 ఆఖరు తేదీ. ఆసక్తి గల వారు నిర్ణీత సమయంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టేట్ అడాప్షన్ ఏజెన్సీ, నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో శిశు గృహం, ఆళ్లగడ్డ బాలసనంలో ఖాళీగా ఉన్న 9 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. అలాగే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖి వన్‌స్టాప్ సెంటర్ (మిషన్ శక్తి-సంబల్) అత్యవసర సేవలలో 5 ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పనితీరు ఆధారంగా వారి సర్వీసును కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇందులో అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఉద్యోగులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. పోస్టుల బట్టీ ఏడో తరగతి, పదో తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్హతతో పాటు అనుభవం అవసరం ఉంటుంది.
14 పోస్టులు
జిల్లాలో మొత్తం 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో శిశు గృహంలో ఖాళీగా డాక్టర్ (పార్ట్ టైమ్) -1 , ఆయా- 5 పోస్టులు, ఆళ్లగడ్డ బాల సదనంలో ఎడ్యుకేటర్- 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్- 1, పీటీ ఇన్ట్స్రక్టర్ కం యోగ టీచర్- 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖి వన్‌స్టాప్ సెంటర్ (మిషన్ శక్తి-సంబల్) అత్యవసర సేవల నందు ఉద్యోగాలు సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్-1, కేస్ వర్కర్-2, పారా మెడికల్ పర్సనల్ లాయర్-1, సైకో సోషల్ కౌన్సిలర్-1 పోస్టులు భర్తీ చేస్తారు.
వేతనం...వయో పరిమితి
డాక్టర్ (పార్ట్‌టైం)- రూ.9,930, ఆయా- రూ.7,944, ఎడ్యుకేటర్- రూ.10,000, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్- రూ.10,000, పీటీ ఇన్ట్స్రక్టర్ కం యోగ టీచర్- రూ.10,000 నెలవారీ వేతనం ఉంటుంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్‌కు రూ.34,000, కేస్ వర్కర్‌కు రూ.19,500, పారా లీగల్ పర్సనల్ లాయర్‌కి రూ.20,000, సైకో సోషల్ కౌన్సిలర్‌కు రూ.20,000 ఉంటుంది. దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు కూడా వర్తిస్తుంది.
డాక్టర్, ఆయా, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్ట్స్రక్టర్ కం యోగ టీచర్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s319b650660b253761af189682e03501dd/uploads/2024/09/2024092830.pdf ను క్లిక్ చేయండి. అందులో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, ఖాళీలను పూర్తి చేయండి. అలాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా మెడికల్ పర్సనల్ లాయర్, సైకో సోషల్ కౌన్సిలర్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s319b650660b253761af189682e03501dd/uploads/2024/09/2024092775.pdf ను క్లిక్ చేయండి. అందులో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి, అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, దాబరాల్ మసీద్ దగ్గర, సంజీవ నగర్, నంద్యాలలో అందజేయాలి.
అభ్యర్థి తన సొంత చిరునామా రాసి రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి ధరఖాస్తుకు జతచేయాలి. అభ్యర్థి వివరాలు నిర్దిష్ట ఫార్మెట్‌లో రాసి ఫోటో అతికించాలి. విద్యార్హత, పని అనుభం, కులం, పుట్టిన తేదీ, నివాస ధ్రువపత్రం, పాస్‌పోర్టు (తహసీల్దారు చేత జారీ చేసిన), దరఖాస్తుతో ధ్రువపత్రాలు జిరాక్స్ కాపీలను (గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతచేయాలి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు