ITBP Recruitment 2024: కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ITBP) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐటీబీపీలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 6. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 545 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఖాళీల సంఖ్య తాత్కాలికమేనని, తర్వాత మారవచ్చని ఐటీబీపీ తెలిపింది.
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులకు 2024 నవంబర్ 6 నాటికి కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. అలాగే, వారి వయస్సు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో, నిబంధనల మేరకు సడలింపు ఇచ్చారు. కనీస విద్యార్హత విషయానికి వస్తే, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీస విద్యార్హతతో పాటు హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అదనంగా, అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న శారీరక ప్రమాణాలు, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. రెండు దశల్లో నియామక ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) ఉంటాయి. ఈ దశకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సమాచార బులెటిన్ లో పొందుపరిచారు. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారు రెండో దశలో రాత పరీక్షకు హాజరు కావడానికి అర్హులవుతారు. రాత పరీక్షలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష విధానం (కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్)ను ఐటీబీపీ నిర్ణయిస్తుంది.
రాత పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి