LIVE UPDATES
YS Jagan Questions : చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు - సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 6 ప్రశ్నలు
Andhra Pradesh News Live November 24, 2024: YS Jagan Questions : చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు - సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 6 ప్రశ్నలు
24 November 2024, 13:09 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan Questions : చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు - సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 6 ప్రశ్నలు
- కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati : అమరావతి ప్రజలకు మరో శుభవార్త.. ప్రత్యేకంగా 9 రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు
- Amaravati : అమరావతి అభివృద్ధి కోసం చాలామంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అందుకు ప్రభుత్వం వారికి ప్లాట్లు కేటాయిస్తోంది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాకుండా సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: EdCIL Counsellors: ఏపీ విద్యాశాఖలో మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్.. 255పోస్టుల భర్తీ…
- EdCIL Counsellors: కేంద్ర ప్రభుత్వ ఎడ్‌సిల్ ఇండియాలో కౌన్సిలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని 26జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Crime News : ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం - ఆపై డబ్బుల కోసం వేధింపులు!
- ప్రేమ పేరుతో ఏలూరు జిల్లాకు చెందిన ఓ బాలికపై అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేశాడు. ఆపై డబ్బుల కోసం వేధింపులు కొనసాగించాడు. విషయంలో వెలుగులోకి రావటంతో ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదైంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Container Hospital : ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మన్యంలో కంటెయినర్ ఆసుపత్రి.. డోలీలకు స్వస్తి
- AP Container Hospital : ఉత్తరాంధ్రలోని మన్యం ఆవాసాల్లో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా గర్భిణులను డోలీల్లో మోసుకుంటూ కొండల నడుమ ఆసుపత్రులకు తరలించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ కష్టాల్లోంచి వారిని గట్టెక్కించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: BEL Jobs: రూ.12.5లక్షల వార్షిక వేతనంతో బెల్‌లో ఉద్యోగాలు…దరఖాస్తు చేయండి ఇలా
- BEL Jobs: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రకాల ఇంజీనిరింగ్ విభాగాల్లో గరిష్టంగా ఏడేళ్ల కాల వ్యవధితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వార్షిక వేతనం రూ.12.5లక్షల వరకు చెల్లిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada : విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన -వెలుగులోకి ఉపాధ్యాయుడి కీచకపర్వం, పోక్సో కేసు నమోదు
- విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి జరిగింది. ఈ ఘటన కాకినాడలో వెలుగు చూసింది. విద్యార్థినుల ఫిర్యాదుతో సదరు ఉపాధ్యాయుడిపై పొక్సో కేసు నమోదైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు జిల్లా విద్యాధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Donation : టీటీడీకి చెన్నై భక్తుడి భారీ విరాళం - రూ.2.02 కోట్లు అందజేత
- TTD News : చెన్నైకి చెందిన భక్తుడు టీటీడీ రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.