తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Temple : ఆ రోజున శ్రీవారి ఆలయం 11 గంటలు మూసివేత

Tirumala Temple : ఆ రోజున శ్రీవారి ఆలయం 11 గంటలు మూసివేత

HT Telugu Desk HT Telugu

06 November 2022, 21:22 IST

    • Lunar Eclipse : చంద్రగ్రహణం కారణంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 నుండి రాత్రి  దాదాపు 7.30 గంట‌ల‌ వరకు 11 గంటల పాటు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించరు.
తిరుమల ఆలయం
తిరుమల ఆలయం

తిరుమల ఆలయం

చంద్రగ్రహణం కారణంగా న‌వంబ‌రు 8న గంట‌ల‌ వరకు 11 గంటల పాటు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంటాయి. బ్రేక్ ద‌ర్శనం రద్దు చేశారు. నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించరు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

చంద్రగ్రహణం కారణంగా శ్రీ‌వాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంట‌లకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని టీటీడీకి కోరింది.

చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 గంట‌ల‌ నుండి రాత్రి 7.30 గంటల వరకు టీటీడీ స్థానికాలయాల తలుపులు మూసివేస్తారు. స్థానికాలయాల్లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.

మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఈ మేరకు కార్యక్రమాలు జరుగుతాయి. తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భ‌క్తుల‌ను సర్వదర్శనానికి అనుమ‌తిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అలంకారం,నివేద‌న‌, దీపారాధ‌న‌, రాత్రి 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వహిస్తారు.