తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh In Ysr District: ఫ్యాన్ కు ఉక్కపోత! సిఎం ఇలాకాలో హోరెత్తుతున్న యువగళం

Lokesh In Ysr District: ఫ్యాన్ కు ఉక్కపోత! సిఎం ఇలాకాలో హోరెత్తుతున్న యువగళం

HT Telugu Desk HT Telugu

06 June 2023, 11:48 IST

    • Lokesh In Ysr District: కడప గడపలో నారా లోకేష్ యువగళం ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ వీక్ అనుకున్న చోట పాదయాత్ర పీక్‌లో  జరుగుతుండటం టీడీపీ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఇలాకాలో ప్రతిపక్ష నేత ర్యాలీకి లభిస్తున్న స్పందన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 
కడపలో 1500కి.మీ పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర
కడపలో 1500కి.మీ పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర

కడపలో 1500కి.మీ పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర

Lokesh In Ysr District: వైసీపీలో కడప కలవరం మొదలైంది. టీడీపీ వీక్ అనుకున్న చోట లోకేష్ పాదయాత్ర పీక్‌లో జరగడమే దీనికి కారణం. ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పు దేనికి సంకేతమనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

Ooty, Kodaikanal: వేసవి సెలవుల్లో ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా, వెళ్లాలంటే ఈపాస్ తప్పనిసరి..

ఏపిలో వైసీపీ ఉలిక్కి పడే పరిణామాలు కడపలో చోటు చేసుకుంటున్నాయి. నారా లోకేష్‌కు ఊహించని విధంగా లభిస్తున్న ఆదరణతో ఫ్యానుకు ఉక్కపోసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప గడపలో కంచుకోటలు బద్దలు అయ్యే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని టీడీపీ నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నారా లోకేష్ 117 రోజుల క్రితం మొదలు పెట్టిన యువగళం పాదయాత్రను లైట్ గా తీసుకున్న వైసీపీకి కడపలో లభిస్తున్న ఆదరణతో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు జరిగిన యాత్ర ఒక ఎత్తు అయితే, యువగళం కడప గడపలో అడుగుపెట్టిన తరువాత కనిపిస్తున్న వైబ్రేషన్ మరో ఎత్తు అని చెప్పవచ్చంటున్నారు.

నాలుగు నెలల క్రితం లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు హేళన చేసిన వైసీపీ ఇప్పుడు పునరాలోచించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం కలిగించిన అడ్డంకులు, సమస్యలను దాటుకుని యాత్ర సాగుతోంది. చిత్తూరులో మొదలైన యువగళం అనంతపురం జిల్లాకు వచ్చే సరికి మార్క్ కనిపించింది.

ఒక్క ఎమ్మెల్యే లేని కర్నూలులో కూడా యాత్ర ఫుల్‌ జోష్ తో సాగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే గత నెల 23వ తేదీన కడప జిల్లాలో యువగళం పాదయాత్ర మొదలైన నాటి నుంచి వస్తున్న స్పందన...యాత్ర సాగుతున్న తీరును ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది.

కంచుకోటలో ఉత్సాహంగా యువగళం యాత్ర….

కడప జిల్లా అంటే వైసీపీకి కంచుకోట. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా టీడీపీ గెలుచుకోలేదు. మొదటి నుంచి వైఎస్ కుటుంబ ఆధిపత్యం ఉండే జిల్లాగా కడపను అంతా చూస్తారు. అయితే అలాంటి చోట రెండు వారాలుగా జరుగుతున్న నారా లోకేష్ యవగళం పాదయాత్రం నిజంగానే వైసీపీకి ఆందోళన కలిగిస్తుంది. ఆలోచింప చేస్తోంది.

గత నెల 23వతేదీన కడప జిల్లాలో మొదలై జమ్మలమడుగు,పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం ల మీదుగా సాగుతున్న యాత్ర ప్రతి పక్ష టీడీపీలోనే కాదు...అధికార పక్ష వైసీపీలోను ఇప్పుడు చర్చగా మారింది. ఉదయంనుంచి సాయంత్రం వరకు సాగుతున్న పాదయాత్రకు చూసుకున్నా, ఇటు పబ్లిక్ మీటింగ్ లకు చూసుకున్నా జనం పోటెత్తుతున్నారు.

వీళ్లంతా కార్యకర్తలు మాత్రమే అనుకోవాడానికి లేదని యాత్ర జరుగుతున్న తీరును చూస్తే అర్థం అవుతుంది. పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న వారిలో, యువగళంపై ఆసక్తి చూపుతున్నవారిలో యవత, మహళలతో పాటు వివిధ వర్గాల ప్రజలు వస్తున్నారు. కేవలం తెలుగు దేశం కార్యకర్తలతోనే సాగుతున్న యాత్ర అని వైసీపీ లెక్కలు వేసుకుని సర్థిచెప్పుకుంటే మాత్రం వారిని వారు మోసం చేసుకుంటున్నట్లేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.

లోకేష్‌పై మాటల దాడితో పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సృష్టించిన సమస్యలు మొదట్లో యాత్రకు కొంత అటెన్షన్ తెచ్చాయి. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర అంటూ లోకేష్ చెప్పినట్లే, అధికార పార్టీ చర్యలు, అడ్డంకులు లోకేష్‌ యాత్రకు పరోక్షంగా ఫోకస్ తెచ్చి పెట్టాయి. తెలుగు దేశం పార్టీ బలంగా ఉండే అనంతపురంలో యాత్రకు జనం వచ్చారు అంటే అర్థం ఉన్నా, టీడీపీ వీక్ అని అంతా భావించే కడప జిల్లాలోనే యువగళం పీక్ లో సాగడం మాత్రం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

కడపలో వివేకా హత్య విషయాన్ని సూటిగా ప్రస్తావించి...జగన్‌ను ప్రశ్నించి, సిఎంకు అసౌకర్య వాతావరణం కలిగించడంలో లోకేష్ సక్సెస్ అయ్యాడు. కడపకు సిఎంగా జగన్ ఏం చేశాడు అని ప్రశ్నించడం ద్వారా జిల్లా వాసుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగాలు, ఇరిగేషన్ వంటి స్థానిక సమస్యల ప్రస్తావన ద్వారా సభకు వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాడు.

కర్నూలు జిల్లాలో వైఎస్ స్మృతి వనం వద్ద నమస్కరించడం ద్వారా పరిణితి ప్రదర్శించిన లోకేష్, తండ్రి వర్థంతికి, జయంతికి జగన్ కడప జిల్లాకు రావడం తప్ప జిల్లాకు ఏం చేశాడు అని ప్రశ్నించడం ద్వారా మరింత సూటిగా దాడి చేశాడు.మొత్తంగా చూసుకుంటే రెండు వారాలుగా కడప జిల్లాలో సాగుతున్న లోకేష్ యువగళం మాత్రం కొత్త చర్చకు, వైసీపీలో కలవరానికి కారణం అవుతోంది.