తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nursing College : బొట్టు పెట్టుకుంటున్నారని నర్సింగ్ విద్యార్ధినులపై వేధింపులు

Nursing College : బొట్టు పెట్టుకుంటున్నారని నర్సింగ్ విద్యార్ధినులపై వేధింపులు

HT Telugu Desk HT Telugu

01 February 2023, 10:05 IST

    • Nursing College నర్సింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్ధినులు బొట్టు పెట్టుకున్నందుకు ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం చేయడం  కర్నూలు కలకలం రేపింది. డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో  మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ శిక్షణ పొందుతున్న విద్యార్ధినులనను  ప్రిన్సిపల్  వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 
నర్సింగ్ విద్యార్ధినులపై వేధింపులు
నర్సింగ్ విద్యార్ధినులపై వేధింపులు

నర్సింగ్ విద్యార్ధినులపై వేధింపులు

Nursing College కర్నూలు డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్‌ కోర్సులో శిక్షణ పొందున్న విద్యార్ధినులను ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడంతో వారు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు విద్యార్దినులు ఉరి వేసుకోడానికి ప్రయత్నించడంతో కలకలం రేగింది. కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

విద్యార్ధినులకు అదే ప్రాంగణంలో వసతి సౌకర్యం కల్పించారు. ఈ కోర్సుకు ప్రిన్సిపల్‌, వార్డెన్‌గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. విద్యార్ధినులను సుశీల నిత్యం వేధిస్తుండటం, బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడేవారు. దీనికి తోడు ఆమె వ్యక్తిగత పనులన్నీ విద్యార్ధినులతో చేయించు కుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇంట్లో పని కూడా విద్యార్దులతో చేయిస్తున్నారు. ఎవరైనా మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించేవారు.

ప్రిన్సిపల్ వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం ఇద్దరు యువతులు ఫ్యాన్‌కు ఉరి వూసుకునేందుకు యత్నించారు. బాధిత విద్యార్ధినులు తమ సమస్యను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు.

ప్రిన్సిపల్ విజయ సుశీల విద్యార్ధినుల వసతి గృహంలో ఉండకూడదని, వేరే ఇల్లు చూసుకోవాలని చెప్పారు. విద్యార్ధినులు తనపై ఫిర్యాదు చేయడంతో విజయ సుశీల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినుల వద్ద గతంలో తీసుకున్న లేఖలను వారి తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించారు. దీంతో గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిలో ఓ యువతి మంగళవారం మళ్లీ బలవన్మరణానికి ప్రయత్నించారు.

వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్దునులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉందని భావించిన అధికారులు శిక్షణా కేంద్రానికి సెలవులు ప్రకటించారు. విద్యార్థినులందరినీ ఇళ్లకు పంపేశారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు చెప్పారు. ఘటనకు బాధ్యురాలైన వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

టాపిక్