తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Trains Info: నర్సాపూర్‌-బెంగుళూరు మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు..

SCR Trains Info: నర్సాపూర్‌-బెంగుళూరు మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు..

HT Telugu Desk HT Telugu

28 April 2023, 9:34 IST

    • SCR Trains Info: వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి నర్సాపూర్-బెంగుళూరు మధ్య వేసవిలో ఎనిమిది ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. 
వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవి ప్రత్యేక రైళ్లు

SCR Trains Info: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్‌-బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మే 5 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

ట్రైన్ నంబర్ 07153 నర్సాపూర్‌-బెంగళూరు ప్రత్యేక రైలు మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07154 బెంగుళూరు-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌ పేట, బంగార్‌పేట్, కృష్ణార్జునపురం స్టేషన్లలో రెండువైపులా ఆగుతుంది.

నేటి నుంచి పలు రైళ్ల రద్దు….

విజయవాడ శివార్లలోని రాయనపాడు యార్డులో ట్రాఫిక్ బ్లాక్‌ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రైన్‌ నంబర్ 07279 విజయవాడ-భద్రాచలం రోడ్డు, ట్రైన్ నంబర్ 07278 భద్రాచలం రోడ్-విజయవాడ రైలును నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07755 డోర్నకల్ జంక్షన్-విజయవాడ, 07756 విజయవాడ-డోర్నకల్ జంక్షన్ రైళ్లను మూడ్రోజుల పాటు రద్దు చేశారు.