తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Special Trains : ప్రత్యేక రైళ్ల కొనసాగింపు…

SCR Special Trains : ప్రత్యేక రైళ్ల కొనసాగింపు…

HT Telugu Desk HT Telugu

20 January 2023, 6:50 IST

    • SCR Special Trains  ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించారు. యశ్వంత్‌పూర్‌-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ-తిరుపతి, తిరుపతి-జాల్నా, జాల్నా-చాప్రాల మధ్య ప్రత్యేక రైళ్లను కొనసాగించనున్నారు. 
ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

SCR Special Trains సంక్రాంతి సెలవుల తర్వాత కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో ప్రత్యేక రైళ్ళను కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ట్రైన్ నంబర్ 07154/07156 యశ్వంత్‌పూర్‌-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌-యశ్వంత్‌పూర్‌ రైలు, ట్రైన్ నంబర్ 07157 యశ్వంత్‌పూర్‌-నర్సాపూర్ రైలు, ట్రైన్ నెంబర్ 08506 సికింద్రాబాద్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, ట్రైన్ నంబర్ 07323-07324 సికింద్రాబాద్‌-జసిది-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లను పొడిగించారు.

ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

కాకినాడ తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును కూడా పొడిగించారు. ట్రైన్ నంబర్ 07797/07798 కాచిగూడ-తిరుపతి-కాచిగూడ రైలును 20,21 తేదీలలో పొడిగించారు. ఈ ప్రత్యేక రైలు ుదంనగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

ట్రైన్ నంబర్ 07413 తిరుపతి-జాల్నా ప్రత్యేక రైలును ఫిబ్రవరి 2 నుంచి 28వరకు పొడిగించారు. 07414 జాల్నా-తిరుపతి ప్రత్యేక రైలును ఫిబ్రవరి 12 నుంచి మార్చి 5వ తేదీ వరకు పొడిగించారు. ట్రైన్ నంబర్ 07651 జాల్నా-చాప్రా ప్రత్యేక రైలును ఫిబ్రవరి 8 నుంచి మార్చి 1 వరకు పొడిగించారు. ట్రైన్ నంబర్ 07652 చాప్రా-జాల్నా ప్రత్యేక రైలును ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వరకు పొడిగించారు.

డబ్లింగ్ పనులతో ప్యాసింజర్ రైళ్ల రద్దు…

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని గుడివాడ-మచిలీపట్నం సెక్షన్ పరిధిలో డబ్లింగ్ పనుల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07871 గుడివాడ-మచిలీపట్నం ప్యాసింజర్ రైలును నేటి నుంచి జనవరి 29 వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07868 గుడివాడ-మచిలీపట్నం, ట్రైన్ నంబర్‌ 07869 మచిలీపట్నం-గుడివాడ, 07880 గుడివాడ-మచిలీపట్నం ప్యాసింజర్‌ రైళ్లను జనవరి 20 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రైన్ నంబర్ 07464 విజయవాడ-గుంటూరు, 07465 గుంటూరు-విజయవాడ, 07628 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లను 20వ తేదీ నుంచి 22వరకు రద్దు చేశారు. విజయవాడ-మచిలీపట్నం-విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను మచిలీపట్నం-గుడివవాడ మధ్య రద్దు పాక్షికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను పెడన-మచిలీపట్నం మధ్య రద్దు చేశారు. గుంటూరు-రేపల్లె మధ్య నడిచే ప్యాసింజర్ రైలును గుంటూరు-తెనాలి వరకు పరిమితం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఇది వర్తిస్తుంది.

టాపిక్