తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rain Alert In Andhra Pradesh : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

Rain Alert In Andhra Pradesh : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

HT Telugu Desk HT Telugu

29 August 2022, 19:39 IST

google News
    • ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్టుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు (unplash)

ఏపీలో వర్షాలు

తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి బలహిన పడింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి దక్షిణం వైపు వంగి ఉంది. ఈ కారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. చిత్రావతి, స్వర్ణముఖి, పెన్నా తదితర నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి.

తెలంగాణలోనూ.. ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది.

మరో రెండు రోజుల వరకు.. తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. హైదరాబాద్ లోనూ వాతావరణ మారింది. సోమవారం ఉదయం నుంచి మేఘావృతమై ఉంది. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం